Breaking News

మీడియా క్రికెట్‌లో దూసుకుపోతున్న సాక్షి టీమ్‌.. ఫైనల్లో టీవీ9తో అమీతుమీ

Published on Wed, 12/10/2025 - 19:16

జర్నలిస్ట్‌ ప్రీమియర్‌ లీగ్‌ టీ20 క్రికెట్‌ పోటీలు గత నాలుగు రోజులుగా హైదరాబాద్‌లో సందడిగా సాగుతున్నాయి. ఈ టోర్నీలో సాక్షి టీమ్‌ ఆటగాళ్లు అదరగొడుతున్నారు. తొలి రోజు బిగ్‌ టీవీతో జరిగిన నాకౌట్‌ మ్యాచ్‌లో అద్భుతమైన ఆటతో విజయదుందుబి మోగించారు.

ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బిగ్‌ టీవీ టీమ్‌.. 20 ఓవర్లలో 115 పరుగులు చేయగా సాక్షి టీమ్‌ కేవలం 12.5 ఓవర్లలో రెండే వికెట్లో కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 

సాక్షి టీమ్‌కు చెందిన సతీష్‌ 48 పరుగులు చేయగా.. రమేష్‌ 47 పరుగులు చేసి సత్తా చాటారు. ఈ విజయంతో సాక్షి సెమీస్‌లోకి అడుగు పెట్టింది.

బుధవారం జరిగిన సెమీస్‌లో సాక్షి టీమ్‌ మరోసారి సత్తా చాటింది. వీ6తో జరిగిన మ్యాచ్‌లో అదిరిపోయే విజయం​ సాధించి విజయపరంపరను కొనసాగించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేసిన వీ6ను సాక్షి 104 పరుగులకు కట్టడి చేసింది. సాక్షి బౌలర్లలో రామకృష్ణ, అనిల్‌, రమేష్‌లు అద్భుతంగా బౌలింగ్‌ చేసి తలో 2 వికెట్లు తీశారు.

అనంతరం చేధనకు దిగిన సాక్షి టీమ్‌ కేవలం 12.2 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఊదేసింది. రమేష్‌ 83 పరుగులు చేసి ఒంటిచేత్తో సాక్షిని గెలిపించాడు. బౌలింగ్‌లోనూ 2 వికెట్లతో సత్తా చాటి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. ఈ గెలుపుతో సాక్షి టీమ్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగే ఫైనల్లో సాక్షి టీమ్‌ టీవీ9తో అమీతుమీ తేల్చుకుంటుంది.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)