ఫైనల్లో సాకేత్‌–రామ్‌ జోడీ

Published on Sat, 02/08/2025 - 03:34

చెన్నై: కొత్త ఏడాదిలో ఆడుతున్న మూడో టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ టెన్నిస్‌ ప్లేయర్, భారత డేవిస్‌కప్‌ జట్టు మాజీ సభ్యుడు సాకేత్‌ మైనేని(Saket Myneni) టైటిల్‌ పోరుకు అర్హత సాధించాడు. భారత్‌కే చెందిన రామ్‌కుమార్‌ రామనాథన్‌తో జత కట్టిన సాకేత్‌ చెన్నై ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌–100 టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్‌ తొలి సెమీఫైనల్లో మూడో సీడ్, డిఫెండింగ్‌ చాంపియన్‌ సాకేత్‌–రామ్‌కుమార్‌ (భారత్‌) ద్వయం 7–6 (7/5), 7–6 (10/8)తో టాప్‌ సీడ్‌ రే హో (చైనీస్‌ తైపీ)–మాథ్యూ క్రిస్టోఫర్‌ రోమియోస్‌ (ఆ్రస్టేలియా) జోడీపై సంచలన విజయం సాధించింది. 

98 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్‌–రామ్‌ ఐదు ఏస్‌లు సంధించి, మూడు డబుల్‌ ఫాల్ట్‌లు చేశారు. రెండు జోడీలు తమ సర్వీస్‌లను రెండేసి సార్లు  కోల్పోయాయి. అయితే టైబ్రేక్‌లో మాత్రం సాకేత్‌–రామ్‌ ద్వయం పైచేయి సాధించి విజయాన్ని ఖరారు చేసుకుంది. 

నేడు జరిగే ఫైనల్లో షింటారో మొచిజుకి–కైటో యుసుగి (జపాన్‌) జోడీతో సాకేత్‌–రామ్‌ ద్వయం తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో మొచిజుకి–యుసుగి జంట 4–6, 6–4, 10–6తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో రెండో సీడ్‌ జీవన్‌ నెడుంజెళియన్‌–విజయ్‌ సుందర్‌ ప్రశాంత్‌ (భారత్‌) జోడీపై గెలిచింది. 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)