Breaking News

చెన్నై ఏటీపీ టోర్నీ రన్నరప్‌గా సాకేత్‌ జోడీ

Published on Sun, 02/09/2025 - 02:46

చెన్నై: ఆంధ్రప్రదేశ్‌ టెన్నిస్‌ ప్లేయర్, భారత డేవిస్‌ కప్‌ జట్టు మాజీ సభ్యుడు సాకేత్‌ మైనేని ఈ సీజన్‌లో చెన్నై ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌–100 టోర్నీలో  డబుల్స్‌ టైటిల్‌ నిలబెట్టుకోలేకపోయాడు. భారత సహచరుడు రామ్‌కుమార్‌ రామనాథన్‌తో కలిసి బరిలోకి దిగిన సాకేత్‌  చివరకు రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు.  శనివారం జరిగిన తుదిపోరులో సాకేత్‌ – రామ్‌కుమార్‌ జోడి  4–6, 4–6తో షింటారో మొచిజుకి–కైటో వుసుగి (జపాన్‌) జంట చేతిలో పరాజయం చవిచూసింది. 

జపాన్‌ జోడీ మ్యాచ్‌ ఆరంభం నుంచే భారత ఆటగాళ్లపై పైచేయి సాధించింది. దీంతో తొలి సెట్‌ గెలిచేందుకు ఎంతోసేపు పట్టలేదు. తర్వాత రెండో సెట్‌లోనూ భారత జంట పుంజుకోలేకపోయింది. ఇదే అదనుగా షింటారో–కైటోలు చక్కని సమన్వయంతో వరుసగా రెండో సెట్‌తో పాటు టైటిల్‌ను గెలుచుకుంది. 

గతేడాది ఇక్కడ భారత ద్వయం టైటిల్‌ సాధించింది. ఈ సారీ టైటిల్‌ వేటలో నిలిచినా... చివరి మెట్టుపై చతికిలబడింది. సాకేత్‌–రామ్‌ కుమార్‌ జోడీ తదుపరి ఈ నెల 17 నుంచి పుణేలో జరిగే ఏటీపీ చాలెంజర్‌ టోర్నమెంట్‌ బరిలోకి దిగుతుంది.    

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)