Breaking News

సాకేత్‌–రామ్‌కుమార్‌ జోడీకి సియోల్‌ ఓపెన్‌ డబుల్స్‌ టైటిల్‌

Published on Mon, 11/04/2024 - 03:48

ఎనిమిది నెలల విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్‌ టెన్నిస్‌ స్టార్, భారత డేవిస్‌కప్‌ జట్టు సభ్యుడు సాకేత్‌ మైనేని మరో అంతర్జాతీయ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. దక్షిణకొరియాలో ఆదివారం ముగిసిన సియోల్‌ ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌–100 టోర్నీలో సాకేత్‌–రామ్‌కుమార్‌ రామనాథన్‌ (భారత్‌) జోడీ పురుషుల డబుల్స్‌ టైటిల్‌ను దక్కించుకుంది. 

ఫైనల్లో సాకేత్‌–రామ్‌కుమార్‌ ద్వయం 6–4, 4–6, 10–3తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో వాసిల్‌ కిర్కోవ్‌ (అమెరికా)–బార్ట్‌ స్టీవెన్స్‌ (నెదర్లాండ్స్‌) జోడీపై నెగ్గింది. సాకేత్‌–రామ్‌కుమార్‌ జంటకు 7,580 డాలర్ల (రూ. 6 లక్షల 37 వేలు) ప్రైజ్‌మనీతో పాటు 100 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. ఓవరాల్‌గా ఈ ఏడాది సాకేత్‌–రామ్‌మూడో ఏటీపీ చాలెంజర్‌ డబుల్స్‌ టైటిల్‌ను గెల్చుకున్నారు. 

ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఈ ఇద్దరు బెంగళూరు ఓపెన్, చెన్నై ఓపెన్‌ టోర్నీల్లో విజేతలుగా నిలిచారు. ఓవరాల్‌గా సాకేత్‌ కెరీర్‌లో ఇది 19వ ఏటీపీ చాలెంజర్‌ డబుల్స్‌ టైటిల్‌. ఏటీపీ చాలెంజర్‌ టోర్నీలు కాకుండా సాకేత్‌ మరో 19 ఐటీఎఫ్‌ టోర్నీ డబుల్స్‌ టైటిల్స్‌ కూడా గెలిచాడు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)