Breaking News

డిప్రెషన్‌తో బాధ‌ప‌డుతున్నా.. న‌న్ను సెల‌క్ట్ చేయ‌వ‌ద్దు: స్టార్‌ క్రికెటర్‌

Published on Thu, 08/08/2024 - 10:53

పాకిస్తాన్ ప‌ర్య‌ట‌న‌కు ముందు బంగ్లాదేశ్ క్రికెట్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఆ జ‌ట్టు స్టార్ ఆల్‌రౌండ‌ర్ మ‌హ్మద్ సైఫుద్దీన్ మాన‌సిక స‌మ‌స్య‌ల కార‌ణంగా రెండు నెల‌ల పాటు అన్ని ర‌కాల క్రికెట్‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నాడు.

ఈ క్ర‌మంలో త‌న నిర్ణ‌యాన్ని సైఫుద్దీన్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు తెలియ‌జేసిన‌ట్లు క్రిక్‌బజ్ త‌మ క‌థ‌నంలో పేర్కొంది. రెండు నెల‌ల పాటు త‌న‌ని ఏ ఫార్మాట్‌కు ఎంపిక చేయ‌వ‌ద్ద‌ని బోర్డుకు అత‌డు అభ్య‌ర్ధించిన‌ట్లు స‌మాచారం. బీసీబీ కూడా అత‌డి అభ్య‌ర్ధ‌న ప‌ట్ల సానుకూలంగా స్పందించిన‌ట్లు తెలుస్తోంది.

కాగా ఈ నెల‌లో బంగ్లాదేశ్ జ‌ట్టు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో త‌ల‌ప‌డేందుకు పాకిస్తాన్‌కు వెళ్ల‌నుంది. ఆగ‌స్టు 21 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. సీనియ‌ర్ జ‌ట్టు కంటే ముందు బంగ్లాదేశ్-ఎ జ‌ట్టు పాక్ గ‌డ్డ‌పై అడుగుపెట్టనుంది. ఈ టూర్‌లో భాగంగా బంగ్లా ఎ జ‌ట్టు.. . పాకిస్తాన్‌ షహీన్స్‌తో రెండు నాలుగు రోజుల అనాధికారిక టెస్టులు, మూడు వన్డేలలో త‌ల‌ప‌డ‌నుంది. 

అయితే ఈ టూర్‌కు ఎంపిక చేసిన బంగ్లా ఎ జ‌ట్టులో సైఫుద్దీన్‌కు సెల‌క్ట‌ర్లు చోటిచ్చారు. ఈ సిరీస్‌లో అత‌డి ప్ర‌ద‌ర్శ‌నను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోని పాక్‌తో టెస్టుల‌కు ఎంపిక చేయాల‌ని బంగ్లా సెల‌క్ట‌ర్లు భావించ‌రంట‌. కానీ అంత‌లోనే డిప్రెషన్ కార‌ణంగా సైఫుద్దీన్ త‌ప్పుకున్నాడు.

కాగా టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024 బంగ్లాదేశ్ జ‌ట్టులో సైఫుద్దీన్‌కు చోటు ద‌క్క‌లేదు. టీ20 క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న‌ప్ప‌ట‌కి  సెల‌క్ట‌ర్లు మాత్రం అత‌డి స్ధానంలో తాంజిమ్ హసన్ షకీబ్‌కు ఛాన్స్ ఇచ్చారు. అప్ప‌టి నుంచి సైఫుద్దీన్ మాన‌సికంగా కాస్త ఇబ్బంది ప‌డుతున్నాడు. ఈ క్రమంలోనే రెండు నెలల పాటు అతడు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
చదవండి: ప్రపంచం ఏం అంతం కాదు.. నిజంగా అదో పెద్ద జోక్‌: రోహిత్‌ శర్మ

Videos

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)