చ‌రిత్ర సృష్టించిన సాయి సుదర్శన్‌.. సచిన్ రికార్డు బ‌ద్ద‌లు

Published on Fri, 05/02/2025 - 20:42

ఐపీఎల్‌-2025లో గుజ‌రాత్ టైటాన్స్ యువ ఓపెనర్ సాయిసుదర్శన్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగం‍గా అహ్మదాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సుదర్శన్ విధ్వం‍సం సృష్టించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లను ఊతికారేశాడు. 

ముఖ్యంగా గుజరాత్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన స్టార్ పేసర్ మహ్మద్ షమీకి సుదర్శన్‌ చుక్కలు చూపించాడు. ఆ  ఓవర్‌లో ఐదు ఫోర్ల సాయంతో ఏకంగా 20 పరుగులు పిండుకున్నాడు.  ఓవరాల్‌గా 23 బంతులు ఎదుర్కొన్న 9 ఫోర్ల సాయంతో 48 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో సుదర్శన్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 

టీ20ల్లో అత్యంతవేగంగా 2000 పరుగుల మైలు రాయిని అందుకున్న భార‌త క్రికెట‌ర్‌గా సాయి సుదర్శన్ రి​కార్డు సృష్టించాడు. సుదర్శన్ కేవలం 54 ఇన్నింగ్స్‌లలో అందుకున్నాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు భార‌త క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్ పేరిట ఉండేది. 

సచిన్ ఈ ఘ‌న‌త‌ను 59 ఇన్నింగ్స్‌ల‌లో అందుకున్నాడు. తాజా మ్యాచ్‌తో స‌చిన్ రికార్డును ఈ త‌మిళ‌నాడు బ్యాట‌ర్ బ్రేక్ చేశాడు. ఓవ‌రాల్‌గా ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ షాన్ మార్ష్‌(53) అగ్రస్దానంలో ఉండ‌గా.. రెండో స్దానంలో సుద‌ర్శ‌న్ కొన‌సాగుతున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు  బ్రాడ్ హాడ్జ్ , మార్కస్ ట్రెస్కోథిక్, ముహమ్మద్ వసీం పేరిట సంయుక్తంగా ఉండేది. తాజా మ్యాచ్‌తో వీరిని సుదర్శన్ అధిగమించాడు. 
చ‌ద‌వండి: బాబర్‌ ఆజం, మహ్మద్‌ రిజ్వాన్‌లకు షాక్‌.. అకౌంట్లు బ్లాక్‌

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)