Breaking News

ప్రియాంక్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ వృధా.. దులీప్ ట్రోఫీ విజేతగా సౌత్‌ జోన్‌

Published on Sun, 07/16/2023 - 13:35

దులీప్‌ ట్రోఫీ-2023 విజేతగా సౌత్‌ జోన్‌ నిలిచింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో వెస్ట్‌జోన్‌పై 75 పరుగుల తేడాతో సౌత్‌ జోన్ విజయం సాధించింది. ఇది సౌత్‌జోన్‌కు 14వ దులీప్‌ ట్రోఫీ విజయం కావడం గమనార్హం. 182/5 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన వెస్ట్‌జోన్‌.. అదనంగా కేవలం 40 పరుగులు మాత్రమే చేసి ఓటమి చవి చూసింది.

వెస్ట్ జోన్‌ కెప్టెన్ ప్రియాంక్ పాంచల్‌ (95), సర్ఫరాజ్‌ ఖాన్ (48) పోరాడినా.. ఓటమి తప్పలేదు. సౌత్‌ జోన్ బౌలర్లు వాసుకి కౌషిక్ (4/36), సాయి కిశోర్ (4/57) చెలరేగడంతో వెస్ట్‌జోన్‌ కుప్పకూలింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో సౌత్‌ జోన్‌ 213 పరుగులకు ఆలౌటైంది. అనంతరం వెస్ట్‌జోన్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే చాపచుట్టేసింది.

సౌత్‌ జోన్ బౌలర్ కావేరప్ప ఏకంగా ఏడు వికెట్లు తీసి వెస్ట్‌ జోన్‌ను దెబ్బకొట్టాడు. దీంతో 67 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సౌత్‌ జోన్‌ 230 పరుగుల వద్ద తమ ఇన్నింగ్స్‌ ముగించింది.  దీంతో వెస్ట్‌జోన్ ఎదుట 298 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. అనంతరం వెస్ట్‌జోన్ 222 పరుగులకే పరిమితమైంది. ఇక  ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌, సిరీస్‌ అవార్డులను సౌత్‌ జోన్ బౌలర్ కావేరప్ప సొంతం చేసుకున్నాడు.
చదవండి: Ind Vs Wi: ఇంత తక్కువ ప్రైజ్‌మనీ ఎందుకివ్వడం.. మిక్సీలు, గ్రైండర్లు ఇవ్వడం బెటర్‌!

Videos

వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కార్యక్రమంలో రికార్డింగ్ డ్యాన్సులు.. వీడియో వైరల్..!

LIVE: YSRకు జగన్ నివాళులు

దిగొచ్చిన గోల్డ్ భారీగా తగ్గిన బంగారం.. వెండి

ఇరుముడి OTTలోకి ఎప్పుడు.?

లోకల్ ఎన్నికల్లో భారీ విజయం జగన్ దిశానిర్దేశం

Kapra Lake: గణేష్ విగ్రహాల నిమజ్జనంపై వివాదం..

తెనాలిలో వ్యాపారి కిడ్నాప్ కేసు విషాదాంతం

చంద్రబాబుకు బిగ్ షాక్.. సుప్రీంకోర్టు హెచ్చరిక

సభలో అందరిముందు జనసేన గాలి తీసిన బాబు..

Idupulapaya: YSR ఘాట్‌ వద్ద జగన్‌ నివాళులు

Photos

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)