Breaking News

‘శాఫ్‌’ టోర్నీ సెమీస్‌కు దూసుకెళ్లిన భారత జట్టు

Published on Sat, 08/24/2024 - 16:17

దక్షిణాసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య (శాఫ్‌) అండర్‌–20 చాంపియన్‌షిప్‌లో భారత జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. నేపాల్‌ వేదికగా గ్రూప్‌ ‘బి’ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 1–0 గోల్‌ తేడాతో మాల్దీవులు జట్టుపై గెలిచింది. మ్యాచ్‌ ఆరంభం నుంచి భారత స్ట్రయికర్లు తమ దాడులకు పదును పెట్టారు. కొరౌ సింగ్, కెల్విన్‌ సింగ్‌ టోరెమ్‌ ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌ లక్ష్యంగా కదంతొక్కారు. ఈ క్రమంలో కెల్విన్‌ కొట్టిన షాట్‌ను ఎబందస్‌ యేసుదాసన్‌ గోల్‌గా మలిచేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు.

తర్వాత కాసేపటికి గుర్నాజ్‌ సింగ్‌ ఇచ్చిన కార్నర్‌ పాస్‌ను మోనిరుల్‌ హెడర్‌ గోల్‌ పోస్ట్‌ను చేరలేకపోయింది. అయినా సరే భారత యువ స్ట్రయికర్లు నిరాశచెందక తమ ప్రయత్నాలను కొనసాగించారు. 18వ నిమిషంలో కొరౌ, 47వ నిమిషంలో కెల్విన్‌ గోల్‌ కోసం చేసిన ప్రయత్నాలేవీ ఫలితమివ్వలేదు. రెండో అర్ధభాగంలోను గోల్‌ చేయడం కష్టంగా మారింది. చివరకు ఇంజ్యూరీ టైమ్‌ (90+5వ నిమిషం)లో మంగ్లెంతంగ్‌ కిప్‌జెన్‌ చేసిన గోల్‌ భారత్‌ను గెలిపించింది.

ఫినిషింగ్‌ లోపాలతో గోల్స్‌గా మలచలేకపోయినప్పటికీ కొరౌ సింగ్, కెల్విన్, ఎబిందస్‌లు తమ ఆటతీరుతో ఆకట్టుకున్నారు. సోమవారం జరిగే సెమీఫైనల్లో గ్రూప్‌ ‘ఎ’ రన్నరప్, డిఫెండింగ్‌ చాంపియన్‌ బంగ్లాదేశ్‌తో భారత్‌ తలపడుతుంది.   
 

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు