Breaking News

భారత్‌ టైటిల్‌ నిలబెట్టుకునేనా?

Published on Tue, 07/04/2023 - 05:20

బెంగళూరు: దక్షిణాసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య (శాఫ్‌) టోర్నీలో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ తొమ్మిదోసారి టైటిల్‌ సాధించాలనే లక్ష్యంతో నేడు జరిగే ఫైనల్లో పటిష్టమైన కువైట్‌తో ఆడనుంది. ఈ టోర్నమెంట్‌లో భారత్, కువైట్‌లు తలపడటం ఇది రెండోసారి. లీగ్‌ దశలో హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌ 1–1తో ‘డ్రా’గా ముగిసింది. లెబనాన్‌తో జరిగిన సెమీఫైనల్లో భారత్‌ చక్కని ప్రదర్శనతో పెనాల్టీ షూటౌట్‌లో గెలిచింది. మరోవైపు బంగ్లాదేశ్‌తో జరిగిన మరో సెమీస్‌లో కువైట్‌ 1–0తో విజయం సాధించింది. కువైట్, లెబనాన్‌ పశ్చిమ ఆసియా దేశాలైనప్పటికీ పోటీతత్వం ఉండాలనే ఉద్దేశంతో నిర్వాహకులు ఈ రెండు దేశాలకు ప్రత్యేకంగా ఆహ్వానించాయి.

కంఠీరవ స్టేడియంలో ప్రేక్షకుల మద్దతుతో భారత్‌ నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. సొంతగడ్డపై జరుగుతుండటం భారత్‌కు అనుకూలాంశమైతే... హెడ్‌ కోచ్‌ ఇగోర్‌ స్టిమాక్‌ ఈ ఫైనల్‌కు కూడా జట్టుకు అందుబాటులో ఉండటం లేదు. పాకిస్తాన్‌తో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో మైదానంలోకి వెళ్లి ప్రత్యర్థి ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగడంతో ‘రెడ్‌ కార్డ్‌’తో ఓ మ్యాచ్‌ సస్పెన్షన్‌కు గురయ్యారు. దీంతో లెబనాన్‌ తో కీలకమైన సెమీస్‌ మ్యాచ్‌కు దూరమయ్యారు. అయితే టోర్నీ క్రమశిక్షణ కమిటీ అతనికి రెండు మ్యాచ్‌ల సస్పెన్షన్‌ విధించడంతో.... కువైట్‌తో అమీతుమీకి కూడా గైర్హాజరు కానున్నారు.

1: ఇప్పటి వరకు భారత్, కువైట్‌ జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. భారత్‌ ఒక మ్యాచ్‌లో గెలిచింది. ఒక మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.   
.ట్రోఫీతో భారత జట్టు డిఫెండర్‌ సందేశ్‌ జింగాన్, కువైట్‌ జట్టు గోల్‌కీపర్‌ బదర్‌ బిన్‌ సానూన్‌  

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)