Breaking News

గిల్‌పై ప్రశంసల వర్షం కురిపించిన సచిన్‌.. ఏమన్నాడంటే?

Published on Sun, 05/28/2023 - 16:46

ఐపీఎల్‌-2023లో టీమిండియా యువ ఆటగాడు, గుజరాత్‌ టైటాన్స్‌ స్టార్‌ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 16 మ్యాచ్‌లు ఆడిన గిల్‌.. 60.79 సగటుతో 851 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో నాలుగు హాఫ్‌ సెంచరీలతో పాటు మూడు సెంచరీలు ఉన్నాయి. ఇక అహ్మదాబాద్‌ వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరగనున్న ఫైనల్‌ మ్యాచ్‌లో కూడా గిల్‌ తన జోరును కొనసాగించాలని భావిస్తున్నాడు.

ఇక ఇది ఇలా ఉండగా కీలకమైన ఫైనల్‌కు ముందు శుబ్‌మన్‌ గిల్‌పై భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ ఏడాది సీజన్‌లో గిల్‌ ప్రదర్శన ఎప్పటికీ మర్చిపోలేనదని సచిన్‌ కొనియాడాడు.

"ఈ ఏడాది సీజన్‌లో గిల్‌ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. అతడి ఆటతీరు ఎప్పటికీ మర్చిపోలేం. అతడు మూడు సెంచరీలు సాధించాడు. అందులో రెండు సెంచరీలు గుజరాత్‌ ఫైనల్‌కు చేరుకోవడంలో తోడ్పడితే.. మరో సెంచరీ ముంబైకు అవకాశం కల్పించింది. అదే సెంచరీ ఆర్సీబీ కొంపముంచింది. ఈ జెంటిల్‌మెన్‌ గేమ్‌లో ఇటువంటివి సహజం. ముఖ్యంగా గిల్‌ బ్యాటింగ్‌ స్టైల్‌ను నన్ను బాగా అకట్టుకుంది. అతడు ఆడిన షాట్లు చాలా క్లాసిక్‌గా ఉన్నాయి. అదే విధంగా వికెట్ల మధ్య కూడా అతడు చాలా చురుకుగా పరిగెత్తతున్నాడు.

గుజరాత్‌ భారీ స్కోర్‌లు నమోదు చేయడంలో గిల్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఒక్కసారి క్రీజులో సెట్‌ అయ్యాక ప్రత్యర్ది బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇక గుజరాత్‌ చాలా బలమైన జట్టు. గిల్‌, హార్దిక్‌, డేవిడ్‌ మిల్లర్‌ వికెట్లను చెన్నై సాధించగలిగితే.. గుజరాత్‌lio బ్యాక్‌ఫుట్‌లో ఉంచవవచ్చు. అదేవిధంగా ధోని కూడా తన బ్యాటింగ్‌ ఆర్డర్‌లో కొంచెం ముందుకు వస్తే బాగుంటుంది" అని సచిన్‌ ‍ట్విటర్‌లో పేర్కొన్నాడు.
చదవండి: IPL 2023: చరిత్రకు అడుగు దూరంలో శుబ్‌మన్‌ గిల్‌.. అలా అయితే కోహ్లి రికార్డు బద్దలు!

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి