Breaking News

అమెరికా జాతీయ క్రికెట్‌ లీగ్‌ భాగస్వామిగా సచిన్‌

Published on Mon, 10/07/2024 - 04:06

వాషింగ్టన్‌: క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ అమెరికాకు చెందిన నేషనల్‌ క్రికెట్‌ లీగ్‌ (ఎన్‌సీఎల్‌) యాజమాన్యంలో భాగస్వామి అయ్యాడు. ఈ టోర్నీలో ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన దిగ్గజ క్రీడాకారులు ఏదో ఒక రూపంలో పాల్గొంటుండగా... ఇప్పుడు ఆ జాబితాలో సచిన్‌ టెండూల్కర్‌ పేరు చేరింది. అమెరికాలో క్రికెట్‌కు మరింత ఆదరణ పెంచేందుకు ఇది ఉపయోగపడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. 

‘క్రికెట్‌ నా జీవితంలో అతి ముఖ్య భాగం. అలాంటి ఈ ప్రయాణంలో ఎన్‌సీఎల్‌లో భాగం కావడం మరింత ఆనందాన్నిస్తోంది. అమెరికాలో క్రికెట్‌కు మరింత ప్రాచుర్యం లభించే విధంగా కృషి చేస్తా. కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చిన ఎన్‌సీఎల్‌లో నేను భాగస్వామి కావడం సంతోషంగా ఉంది’ అని సచిన్‌ పేర్కొన్నాడు. 

ఎన్‌సీఎల్‌ తొలి సీజన్‌లో సునీల్‌ గవాస్కర్, వెంగ్‌సర్కార్, వెంకటేశ్‌ ప్రసాద్‌ (భారత్‌), జహీర్‌ అబ్బాస్, అక్రమ్, మొయిన్‌ఖాన్‌ (పాకిస్తాన్‌), రిచర్డ్స్‌ (వెస్టిండీస్‌), జయసూర్య (శ్రీలంక) వేర్వేరు జట్లకు కోచ్, మెంటార్‌లుగా వ్యవహరించనున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో మార్పులను స్వాగతించే వారిలో ముందు వరుసలో ఉండే సచిన్‌... ఇప్పుడు ఈ 60 స్ట్రయిక్‌ ఫార్మాట్‌లో భాగం కానున్నారు. 

ఇప్పటికే విశ్వవ్యాప్తంగా టి20, టి10, హండ్రెడ్‌ ఫార్మాట్‌లు ప్రాచుర్యం పొందగా... ఇప్పుడు మరో అడుగు ముందుకు వేస్తూ ఎన్‌సీఎల్‌ సిక్స్‌టీ స్ట్రయిక్స్‌ పేరుతో మరో కొత్త ఫార్మాట్‌కు తెరలేపుతోంది. తొలి ఎడిషన్‌లో  రైనా, దినేశ్‌ కార్తీక్, అఫ్రిది, షకీబ్, షమ్సీ, క్రిస్‌ లిన్, ఏంజెలో మాథ్యూస్, బిల్లింగ్స్‌ వంటి పలువురు ప్లేయర్లు పాల్గొంటారు. 
 

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)