Breaking News

క్లాసెన్ సూపర్‌ సెంచరీ.. 151 పరుగుల తేడాతో సూపర్ జెయింట్స్ భారీ విజయం

Published on Mon, 02/06/2023 - 08:45

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్ మరో అద్భుత విజయం సాధించింది. ఈ లీగ్‌లో భాగంగా ఆదివారం ప్రిటోరియా క్యాపిటిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 151 పరుగుల తేడాతో సూపర్‌ జెయింట్స్‌ విజయభేరి మోగించింది. 255 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రిటోరియా క్యాపిటిల్స్‌ 103 పరుగులకే కుప్పకూలింది.

డర్బన్‌ బౌలర్లలో జూనియర్‌ డలా మూడు వికెట్లతో ప్రిటోరియా పతనాన్ని శాసించగా.. ప్రిటోరియస్‌, ముల్డర్‌ తలా రెండు వికెట్లు, టోప్లీ, కీమో పాల్‌ చెరో ఒక్క వికెట్‌ సాధించారు.  ప్రిటోరియా బౌలర్లలో ఈతాన్ బాష్ 23 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

హెన్రిచ్ క్లాసెన్ సూపర్‌ సెంచరీ..
ఇక టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన డర్బన్ సూపర్ జెయింట్స్.. క్లాసన్‌ అద్భుతసెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసింది. 44 బంతులు ఎదుర్కొన్న క్లాసెన్‌ 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 104 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు బ్రీట్‌జెక్‌(21 బంతుల్లో 46), డికాక్‌(20 బంతుల్లో 43) రాణించారు. ఇక ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 19 పాయింట్లతో సూపర్ జెయింట్స్ ఐదో స్థానంలో ఉంది.
చదవండి: WPL 2023: ముంబై జట్టు హెడ్‌ కోచ్‌గా ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)