Breaking News

చరిత్ర సృష్టించిన పార్ల్‌ రాయల్స్‌

Published on Sun, 01/26/2025 - 17:20

సౌతాఫ్రికా టీ20 లీగ్‌ ఫ్రాంచైజీ అయిన పార్ల్‌ రాయల్స్‌ చరిత్ర సృష్టించింది. టీ20 క్రికెట్‌లో 20 ఓవర్లను స్పిన్నర్లతో వేయించిన తొలి జట్టుగా రికార్డు నెలకొల్పింది. శనివారం​ ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్స్‌ ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌లో రాయల్స్‌ ఐదుగురు స్పిన్నర్లను ప్రయోగించింది. ఫోర్టుయిన్‌, వెల్లలగే, ముజీబ్‌,ఎన్‌ పీటర్‌, రూట్‌ తలో నాలుగు ఓవర్లు వేశారు. ఈ మ్యాచ్‌లో రాయల్స్‌ 11 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో రాయల్స్‌ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఈ సీజన్‌లో రాయల్స్‌ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ఓపెనర్‌ జో రూట్‌ అజేయమైన అర్ద సెంచరీతో రాణించాడు. రూట్‌ 56 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 78 పరుగులు చేశాడు. ఆఖర్లో కెప్టెన్‌ డేవిడ్‌ మిల్లర్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. 

మిల్లర్‌ 18 బంతుల్లో బౌండరీ, 2 సిక్సర్ల సాయంతో 29 పరుగులు చేశాడు. రాయల్స్‌ ఆటగాళ్లలో ప్రిటోరియస్‌ (0), రూబిన్‌ హెర్మన్‌ (9), వాన్‌ బుర్రెన్‌ (5), దునిత్‌ వెల్లలగే (15) నిరాశపరిచారు. ప్రిటోరియా క్యాపిటల్స్‌ బౌలర్లలో విల్‌ జాక్స్‌, ఈథన్‌ బాష్‌, సెనూరన్‌ ముత్తుస్వామి, కైల్‌ సైమండ్స్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

141 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన క్యాపిటల్స్‌ రాయల్స్‌ బౌలర్లు రాణించడంతో నిర్ణీత‌ ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 129 పరుగులే చేయగలిగింది. ఓపెనర్‌ విల్‌ జాక్స్‌ అర్ద సెంచరీతో రాణించాడు. 53 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 56 పరుగులు చేశాడు. కైల్‌ వెర్రిన్‌ (33 బంతుల్లో 30; 2 ఫోర్లు) పర్వాలేదనిపించాడు. 

క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌లో జాక్స్‌, వెర్రిన్‌ మినహా ఎవ్వరూ రాణించలేదు. రహ్మానుల్లా గుర్బాజ్‌ 6, మార్కస్‌ ఆకెర్‌మ్యాన్‌ 2, రిలీ రొస్సో 4, జేమ్స్‌ నీషమ్‌ 1, కీగన్‌ లయన్‌ 2 పరుగులు చేశారు. రాయల్స్‌ బౌలర్లలో ఫోర్టుయిన్‌, ముజీబ్‌ రెహ్మాన్‌, జో రూట్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. వెల్లలగే ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. ఈ సీజన్‌లో భీకరఫామ్‌లో ఉన్న రూట్‌ బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణించి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)