Breaking News

శివాలెత్తిన మార్క్రమ్‌.. విధ్వంసకర శతకం

Published on Sun, 01/18/2026 - 08:32

సౌతాఫ్రికా టీ20 లీగ్‌ 2025-26లో డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్క్రమ్‌ చెలరేగిపోయాడు. పార్ల్‌ రాయల్స్‌తో నిన్న (జనవరి 17) జరిగిన కీలక మ్యాచ్‌లో విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఫలితంగా సూపర్‌ జెయింట్స్‌ 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.

శివాలెత్తిన మార్క్రమ్‌
తొలుత బ్యాటింగ్‌ చేసిన సూపర్‌ జెయింట్స్‌.. మార్క్రమ్‌ శతక్కొట్టుడుతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. మార్క్రమ్‌ 58 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 108 పరుగులు చేసి సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో తన రెండో శతకాన్ని నమోదు చేశాడు.

సికందర్‌ రజా వేసిన ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో మార్క్రమ్‌ శివాలెత్తిపోయాడు. 3 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 28 పరుగులు పిండుకున్నాడు. సూపర్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌లో మార్క్రమ్‌ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. సునీల్‌ నరైన్‌ 4, జోస్‌ బట్లర్‌ 1, కేన్‌ విలియమ్సన్‌ 22, హెన్రిచ్‌ క్లాసెన్‌ 29, లియామ్‌ లివింగ్‌స్టోన్‌ 19 పరుగులకు ఔటయ్యారు.

రాయల్స్‌ బౌలర్లలో హర్దస్‌ విల్యోన్‌ 4 వికెట్లతో సత్తా చాటాడు. ఫోర్టుయిన్‌, బార్ట్‌మన్‌, పోట్గెటర్‌ తలో వికెట్‌ తీశారు.

అనంతరం 190 పరుగుల లక్ష్య ఛేదనలో రాయల్స్‌ తడబడింది. సునీల్‌ నరైన్‌ (4-0-18-2), సైమన్‌ హార్మర్‌ (4-1-13-1), మార్క్రమ్‌ (2-0-9-1), లివింగ్‌స్టోన్‌ (3-0-25-1), కొయెట్జీ (3-0-31-2), మపాకా (2-0-10-1) వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు మాత్రమే చేయగలిగింది.

రాయల్స్‌ ఇన్నింగ్స్‌లో ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేదు. వెర్రిన్‌ (23), హెర్మన్‌ (18), సికందర్‌ రజా (21), ఫోర్టుయిన్‌ (35 నాటౌట్‌) రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా ఆటగాళ్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు.

కాగా, ఈ మ్యాచ్‌ ఫలితంతో సంబంధం లేకుండానే రాయల్స్‌ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఈ జట్టుతో పాటు ప్రిటోరియా క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌కేప్‌ కూడా ప్లే ఆఫ్స్‌ బెర్త్‌లు కన్ఫర్మ్‌ చేసుకున్నాయి. నాలుగో బెర్త్‌ కోసం డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌, జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌, ఎంఐ కేప్‌టౌన్‌ మధ్య పోటీ జరుగుతుంది.

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)