Breaking News

చెలరేగిన పూరన్‌, స్మట్స్‌.. 48 బంతుల్లోనే శతక్కొట్టిన డస్సెన్

Published on Sun, 01/14/2024 - 14:40

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో పరుగుల వరద పారుతుంది. నిన్న (జనవరి 13) జరిగిన మ్యాచ్‌ల్లో పలువురు ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ కేప్‌టౌన్‌ ఆటగాళ్లు వాన్‌ డర్‌ డస్సెన్‌, రికెల్టన్‌  విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడగా.. సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌కేప్‌తో జరిగిన మ్యాచ్‌లో డర్బన్‌ ఆటగాళ్లు నికోలస్‌ పూరన్‌, స్మట్స్‌ రెచ్చిపోయారు. 

డస్సెన్‌ విధ్వంసకర శతకం.. తృటిలో సెంచరీ చేజార్చుకున్న రికెల్టన్‌
జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ కేప్‌టౌన్‌ ఓపెనర్ వాన్‌ డర్‌ డస్సెన్‌ కేవలం 48 బంతుల్లోనే శతక్కొట్టగా.. మరో ఓపెనర్‌ ర్యాన్‌ రికెల్టన్‌ (49 బంతుల్లో 98; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) రెండు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు.

వీరిద్దరి ధాటికి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎంఐ.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోర్‌ చేయగా.. ఛేదనకు చేతులెత్తేసిన సేపర్‌ కింగ్స్‌ 17.5 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌటై 98 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఎంఐ బౌలర్లు జార్జ్‌ లిండే, ఓలీ స్టోన్‌ చెరో 2 వికెట్లు.. హెండ్రిక్స్‌, రబాడ, లివింగ్‌స్టోన్‌, సామ్‌ కర్రన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌లో డు ప్లూయ్‌ (48), రొమారియో షెపర్డ్‌ (34) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు. 

చెలరేగిన పూరన్‌, స్మట్స్‌..
నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో (సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌కేప్‌తో) నికోలస్‌ పూరన్‌ (31 బంతుల్లో 60 నాటౌట్‌; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), జెజె స్మట్స్‌ (38 బంతుల్లో 75; 4 ఫోర్లు, 7 సిక్సర్లు), బ్రీట్జ్కీ (29 బంతుల్లో 43; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగిపోవడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

అనంతరం ఛేదనలో తడబడిన సన్‌రైజర్స్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులకే పరిమితమై 35 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌లో టామ్‌ ఏబెల్‌ (65), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (55), మార్క్రమ్‌ (29) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సూపర్‌ జెయింట్స్‌ బౌలర్లలో స్మట్స్‌, ప్రిటోరియస్‌, గ్లీసన్‌ తలో 2 వికెట్లు పడగొట్టగా.. టాప్లే, కేశవ్‌ మహారాజ్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. 
 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)