Breaking News

ఫోర్టిన్‌ మాయాజాలం, మేయర్స్‌ ఆల్‌రౌండ్‌ షో.. రాజస్థాన్‌, లక్నో జట్ల విజయం

Published on Sat, 01/14/2023 - 13:32

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో నిన్న (జనవరి 13) జరిగిన మ్యాచ్‌ల్లో పార్ల్‌ రాయల్స్‌ (రాజస్థాన్‌ రాయల్స్‌), డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌ (లక్నో సూపర్‌ జెయింట్స్‌) జట్లు విజయం సాధించాయి. తొలి మ్యాచ్‌లో రాయల్స్‌.. సూపర్‌ కింగ్స్‌ను 7 వికెట్ల తేడాతో, సూపర్‌ జెయింట్స్‌.. ముంబై కేప్‌ టౌన్‌ను 5 వికెట్ల తేడాతో మట్టికరిపించాయి. 

తిప్పేసిన రాయల్స్‌ స్పిన్నర్లు..
పార్ల్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌.. స్పిన్నర్లు ఫోర్టిన్‌ (3/16), ఇవాన్‌ జోన్స్‌ (3/21), తబ్రేజ్‌ షంషి (1/4) మాయాజాలం ధాటికి 17.2 ఓవర్లలో 81 పరుగులకే చాపచుట్టేసింది. వెర్రిన్‌ (11), అల్జరీ జోసఫ్‌ (13), విలియమ్స్‌ (17 నాటౌట్‌), ఫాంగిసో (10) మాత్రమే రెండంకెల స్కోర్‌ సాధించారు. స్వల్ప లక్ష్య ఛేదనలో రాయల్స్‌ 10.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. జోస్‌ బట్లర్‌ (21 బంతుల్లో 29; 4 ఫోర్లు) అజేయమైన ఇన్నింగ్స్‌తో రాయల్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. 

తలో చేయి వేసిన ఎంఐని ఓడించిన సూపర్‌ జెయింట్స్‌..
డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎంఐ కేప్‌ టౌన్‌.. రోలోఫ్సన్‌ (44 బంతుల్లో 52; 4 ఫోర్లు, సిక్స్‌) అర్ధసెంచరీతో, జార్జ్‌ లిండే (33), డెలానో పాట్‌గేయిటర్‌ (25) ఓ మోస్తరుగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. సూపర్‌ జెయింట్స్‌ బౌలర్లలో టాప్లే, సుబ్రయెన్‌, విల్యోన్‌ తలో 2 వికెట్లు పడగొట్టగా.. కైల్‌ మేయర్స్‌, జేసన్‌ హోల్డర్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

ఛేదనలో కైల్‌ మేయర్స్‌ (34), వియాన్‌ ముల్దర్‌ (30), హెన్రిచ్‌ క్లాసిన్‌ (36), కీమో పాల్‌ (20 నాటౌట్‌) తలో చేయి వేసి సూపర్‌ జెయింట్స్‌ను గెలిపించారు. ఎంఐ బౌలర్లలో ఓలీ స్టోన్‌ 4 వికెట్లు పడగొట్టగా.. జార్జ్‌ లిండేకు ఓ వికెట్‌ దక్కింది. కాగా, లీగ్‌లో భాగంగా ఇవాళ (జనవరి 14) జరుగబోయే మ్యాచ్‌ల్లో ప్రిటోరియ క్యాపిటల్స్‌-సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌ కేప్‌ జట్లు.. ఎంఐ కేప్‌ టౌన్‌-జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌ జట్లు తలపడనున్నాయి. 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)