Breaking News

బేబీ ఏబీడీ విధ్వంసం.. ముంబై ఇండియన్స్‌ టీమ్‌ శుభారంభం

Published on Wed, 01/11/2023 - 15:04

మినీ ఐపీఎల్‌గా పరిగణించబడే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం కొనుగోలు చేసిన ఎంఐ కేప్‌టౌన్‌ టీమ్‌ శుభారంభం చేసింది. లీగ్‌ ఇనాగురల్‌ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ కొనుగోలు చేసిన పార్ల్‌ రాయల్స్‌ను ఢీకొట్టిన కేప్‌టౌన్‌ జట్టు.. 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన కేప్‌టౌన్‌.. జోఫ్రా ఆర్చర్‌ (3/27), ఓలీ స్టోన్‌ (2/31), డుయన్‌ జన్సెన్‌ (1/16) విజృంభించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగుల నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. రాయల్స్‌ ఇన్నింగ్స్‌లో జోస్‌ బట్లర్‌ (42 బంతుల్లో 51; 6 ఫోర్లు, సిక్స్‌), కెప్టెన్‌ డేవిడ్‌ మిల్లర్‌ (31 బంతుల్లో 42; 4 ఫోర్లు, సిక్స్‌) మాత్రమే రాణించారు.

అనంతరం 143 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేప్‌టౌన్‌ టీమ్‌.. బేబీ ఏబీడీ డెవాల్డ్‌ బ్రెవిస్‌ (41 బంతుల్లో 70 నాటౌట్‌; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం ధాటికి 15.3 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన బ్రెవిస్‌ అజేయమైన అర్ధశతకంతో రాయల్స్‌ బౌలింగ్‌ను తునాతునకలు చేయగా.. మరో ఓపెనర్‌ ర్యాన్‌ రికెల్టన్‌ (33 బంతుల్లో 42; 5 ఫోర్లు, సిక్స్‌) పర్వాలేదనిపించాడు.

వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన సామ్‌ కర్రన్‌.. 16 బంతుల్లో 2 సిక్సర్లు, ఫోర్‌ సాయంతో 20 పరుగులు చేసి ఔటయ్యాడు. బ్రెవిస్‌.. రస్సీ వాన్‌ డర్‌ డస్సెన్‌ (3 బంతుల్లో 8 నాటౌట్‌; సిక్స్‌) సాయంతో మ్యాచ్‌ను ముగించాడు. రాయల్స్‌ బౌలర్లలో కోడి యుసఫ్‌, రామోన్‌ సిమండ్స్‌కు తలో వికెట్‌ లభించింది. లీగ్‌లో తదుపరి మ్యాచ్‌ డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌ (లక్నో సూపర్‌ జెయింట్స్‌)-జొహనెస్‌బర్గ్‌ సూపర్‌ కింగ్స్‌ (చెన్నై సూపర్‌ కింగ్స్‌) జట్ల మధ్య ఇవాళ (జనవరి 11) జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్‌ రాత్రి 9 గంటలకు ప్రారంభంకానుంది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)