Breaking News

జింబాబ్వేతో తొలి టెస్టు.. విజయం దిశగా సౌతాఫ్రికా

Published on Tue, 07/01/2025 - 08:49

బులవాయో వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా విజయం దాదాపు ఖాయమైనట్లే. మ్యాచ్‌ మూడో రోజు సోమవారం దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌లో 82.5 ఓవర్లలో 369 పరుగులకు ఆలౌటైంది. వియాన్‌ ముల్డర్‌ (206 బంతుల్లో 147; 17 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా... కెప్టెన్‌ కేశవ్‌ మహరాజ్‌ (70 బంతుల్లో 51; 4 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్‌ సెంచరీ సాధించాడు.

మసకద్జాకు 4 వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్‌లో 167 పరుగుల ఆధిక్యం సాధించిన దక్షిణాఫ్రికా మొత్తం కలిపి జింబాబ్వే ముందు 537 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. దీనిని ఛేదించే క్రమంలో ఆట ముగిసే సమయానికి జింబాబ్వే ఒక వికెట్‌ కోల్పోయి 32 పరుగులు చేసింది. ఆ జట్టు మిగిలిన రెండు రోజుల్లో మరో 505 పరుగులు చేయాల్సి ఉంది. టెస్టు క్రికెట్‌లో గతంలో ఏ జట్టుకూ సాధ్యం కాని ఈ లక్ష్యాన్ని జింబాబ్వే అందుకోవడం అసాధ్యమే!
చదవండి: IND vs ENG: టీమిండియాకు హార్ట్ బ్రేక్.. ఒక్క వికెట్ తేడాతో ఓట‌మి

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)