Breaking News

రుత్విక–రోహన్‌ జోడీ శుభారంభం

Published on Thu, 03/06/2025 - 04:01

పారిస్‌: ఓర్లియాన్స్‌ మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నీ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో తెలంగాణ అమ్మాయి గద్దె రుత్విక శివాని శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో రుత్విక శివాని–రోహన్‌ కపూర్‌ (భారత్‌) ద్వయం 20–22, 24–22, 21–16తో యె హాంగ్‌ వె–నికోల్‌ గొంజాలెజ్‌ చాన్‌ (చైనీస్‌ తైపీ) జోడీని ఓడించి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 

తొలి గేమ్‌ కోల్పోయిన రుత్విక–రోహన్‌ రెండో గేమ్‌లో రెండుసార్లు మ్యాచ్‌ పాయింట్లు కాపాడుకొని గట్టెక్కారు. నిర్ణాయక మూడో గేమ్‌లో ఆరంభంలోనే 5–1తో ఆధిక్యంలోకి వెళ్లిన రుత్విక–రోహన్‌ చివరివరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని ఖరారు చేసుకున్నారు.  

పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత ప్లేయర్లు కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, ఆయుశ్‌ షెట్టి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించగా... కిరణ్‌ జార్జి, ప్రియాన్షు రజావత్, సతీశ్‌ కుమార్‌ కరుణాకరన్‌ తొలి రౌండ్‌లో ఓడిపోయారు. శ్రీకాంత్‌ 21–19, 21–14తో కూ తకహాషి (జపాన్‌)పై, ప్రణయ్‌ 21–11, 20–22, 21–9తో జు వె వాంగ్‌ (చైనీస్‌ తైపీ)పై, ఆయుశ్‌ 21–17, 21–9తో ప్రపంచ మాజీ చాంపియన్‌ కీ యె లో (సింగపూర్‌)పై గెలిచారు. 

కిరణ్‌ జార్జి 21–15, 16–21, 10–21తో జియా హెంగ్‌ జేసన్‌ (సింగపూర్‌) చేతిలో, ప్రియాన్షు 17–21, 7–21తో అలెక్స్‌ లేనియర్‌ (ఫ్రాన్స్‌) చేతిలో ఓటమి పాలయ్యారు. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో భారత ప్లేయర్లు ఉన్నతి హుడా 9–21, 15–21తో ప్రపంచ నంబర్‌వన్‌ ఆన్‌ సె యంగ్‌ (దక్షిణ కొరియా) చేతిలో... ఇషారాణి బారువా 13–21, 13–21తో అసుక తకహాషి (జపాన్‌) చేతిలో ఓడిపోయారు. 

Videos

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)