Breaking News

ఆండ్రీవా అద్భుతం

Published on Sun, 06/07/2026 - 04:08

పారిస్‌: రష్యా టీనేజ్‌ ప్లేయర్‌ మిరా ఆండ్రీవా అసాధారణ ఆటతో కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ ట్రోఫీని సొంతం చేసుకుంది. క్లే కోర్టుపై తన అద్భుత ప్రదర్శనతో ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను గెలుచుకుంది. శనివారం ఏకపక్షంగా సాగిన ఫైనల్లో వరల్డ్‌ నంబర్‌ 8 ఆండ్రీవా 6–3, 6–2 స్కోరుతో క్వాలిఫయర్‌ మాయ చావలిన్‌స్కా (పోలండ్‌)ను చిత్తు చేసింది. గంటా 22 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో 19 ఏళ్ల ఆండ్రీవా జోరు ముందు 114వ ర్యాంకర్‌ మాయ నిలవలేకపోయింది. 

కోర్టులో ప్రత్యర్థికి అనుకూలంగా పెద్ద సంఖ్యలో పోలండ్‌ అభిమానులు అండగా నిలిచినా...ఒత్తిడిలో పడకుండా ఆండ్రీవా ఆట ముగించింది. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో నాలుగో ప్రయత్నంలో చాంపియన్‌గా నిలిచిన ఆండ్రీవా 1992 (మోనికా సెలెస్‌ – 18 ఏళ్లు) తర్వాత ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయసు్కరాలిగా నిలిచింది. విజేతగా నిలిచిన ఆండ్రీవాకు ప్రైజ్‌మనీగా 28 లక్షల యూరోలు (సుమారు రూ. 31 కోట్లు)...రన్నరప్‌ చావలిన్‌స్కాకు 14 లక్షల యూరోలు (సుమారు రూ.15.30 కోట్లు) ప్రైజ్‌మనీగా లభించాయి.  

2023 మాడ్రిడ్‌ ఓపెన్‌లో సత్తా చాటి క్వార్టర్‌ ఫైనల్‌ వరకు దూసుకొచ్చినప్పుడే ఆండ్రీవా భవిష్యత్తులో పెద్ద స్థాయికి చేరుతుందని అంచనాలు మొదలయ్యాయి. రెండేళ్ల క్రితం ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సెమీస్‌ వరకు చేరడంతో క్లే కోర్టులో ఆండ్రీవా ఆట పదును ఏమిటో కనిపించింది. నాడు గెలుపు అవకాశం చేజార్చుకున్నా...ఇప్పుడు టీనేజర్‌గానే రోలండ్‌ గారోస్‌లో ఆమె విజయనాదం చేయడం విశేషం. 

రష్యాలోని సైబీరియా ప్రాంత నగరం క్రస్నోయార్క్‌లో పుట్టిన ఆండ్రీవా ఆరేళ్ల వయసులో టెన్నిస్‌ మొదలు పెట్టింది. ఆ తర్వాత సోచి నగరానికి వెళ్లి శిక్షణ పొందింది. అయితే అత్యుత్తమ సౌకర్యాలతో ఆటలో స్థాయిని పెంచుకునేందుకు ఆమె కుటుంబం ఫ్రాన్స్‌లోకి ‘కాన్స్‌’ సిటీకి వెళ్లి స్థిరపడింది. ఆమెకంటే రెండేళ్లు పెద్దదయిన ఎరికా ఆండ్రీవా కూడా ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ ప్లేయరే. సింగిల్స్‌లో 6 డబ్ల్యూటీఏ టైటిల్స్‌ గెలుచున్న ఆండ్రీవా గత ఏడాది జూలైలో తన కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్‌ (5)ను అందుకుంది. మాజీ ప్లేయర్, 1994 వింబుల్డన్‌ చాంపియన్‌ కొంషితా మార్టినెజ్‌ వద్ద ఆమె శిక్షణ తీసుకుంటోంది.  

మరో వైపు గ్రాండ్‌స్లామ్‌ నెగ్గిన రెండో క్వాలిఫయర్‌గా గుర్తింపు పొందేందుకు బరిలోకి దిగిన చావలిన్‌స్కా అసలు పోరులో పూర్తిగా తడబడింది.  ఫైనల్‌ చేరే క్రమంలో ఒక్క టాప్‌–20 ప్లేయర్‌తో కూడా తలపడకపోవడంతో ఆమె తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. కెరీర్‌లో చాలెంజర్, ఐటీఎఫ్‌ టోర్నీలో మాత్రమే నెగ్గి ఆమె కెరీర్‌లో ఎక్కువ భాగం టెన్నిస్‌ ఆడేందుకు కావాల్సిన కనీస అవసరాలు తీర్చుకునేందుకే సరిపోయింది.

రోలండ్‌ గారోస్‌లో రెండో రౌండ్‌ నెగ్గిన తర్వాత కూడా ఆమె వద్ద ఆ రోజు హోటల్‌ గదిలో ఆగేందుకు తగినన్ని డబ్బులు లేకపోయాయి. తాజా ప్రదర్శనతో తన కెరీర్‌ మొత్తంలో సాధించిన ప్రైజ్‌మనీకంటే ఎన్నో రెట్లు ఎక్కువ మొత్తం చావలిన్‌స్కా రన్నరప్‌గా అందుకుంది. 114 ర్యాంక్‌తో బరిలోకి దిగిన చావలిన్‌స్కా ఫైనల్‌ చేరడంతో  ఏకంగా 21వ ర్యాంక్‌కు చేరుకోనుంది.  

జ్వెరెవ్‌ X కొబోలి
నేడు జరిగే పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో 2వ సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)తో 10వ సీడ్‌ ఫ్లావియో కొబోలి (ఇటలీ) తలపడతాడు. జ్వెరెవ్‌ గతంలో నాలుగు సార్లు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఫైనల్‌కు చేరినా...ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయాడు. ఈ టోర్నీకి ముందు గత ఏడాది వింబుల్డన్‌లో క్వార్టర్‌ ఫైనల్‌ చేరడమే కొబోలి అత్యుత్తమ ప్రదర్శన. గతంలో ఇద్దరి మధ్య ఒకే ఒక మ్యాచ్‌ జరగ్గా...అందులో జ్వెరెవ్‌ గెలిచాడు. సా.6.30 నుంచి జరిగే ఈ మ్యాచ్‌లో సోనీ స్పోర్ట్స్, సోనీ లివ్‌ యాప్‌లలో ప్రసారం అవుతుంది.

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)