Breaking News

చెస్‌ దిగ్గజం బోరిస్‌ స్పాస్కీ కన్నుమూత

Published on Sat, 03/01/2025 - 09:06

అంతర్జాతీయ చెస్‌ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న బోరిస్‌ స్పాస్కీ (88) మంగళవారం కన్నుమూశారు. రష్యాకు చెందిన ఈ మాజీ ప్రపంచ చాంపియన్‌ మరణించిన విషయాన్ని ‘ఫిడే’ ప్రకటించింది. ప్రపంచ చెస్‌ను సోవియట్‌ యూనియన్‌ శాసిస్తున్న కాలంలో వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచిన వారిలో స్పాస్కీ కూడా ఒకడు.

1969–1972 మధ్య అతను పదో వరల్డ్‌ చాంపియన్‌గా శిఖరాన నిలిచాడు. అయితే డిఫెండింగ్‌ చాంపియన్‌గా స్పాస్కీ బరిలోకి దిగిన 1972 వరల్డ్‌ చాంపియన్‌ పోరాటానికి ప్రపంచ చెస్‌లో ప్రత్యేక స్థానం ఉంది. సోవియట్‌ యూనియన్, అమెరికా మధ్య తీవ్ర వైరంతో ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్న ఆ కాలంలో స్పాస్కీతో అమెరికాకు చెందిన బాబీ ఫిషర్‌ చాలెంజర్‌గా తలపడ్డాడు. 

దాంతో ఈ సమరం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ సమయంలో దీనికి ‘మ్యాచ్‌ ఆఫ్‌ ద సెంచరీ’గా గుర్తింపు వచి్చంది. సోవియట్‌ యూనియన్‌ వర్సెస్‌ అమెరికాగా మారిపోయిన ఈ 21 గేమ్‌ల పోరులో చివరకు 8.5–12.5 పాయింట్ల తేడాతో ఫిషర్‌ చేతిలో ఓడి స్పాస్కీ వరల్డ్‌ టైటిల్‌ను కోల్పోయాడు. 

నాలుగేళ్ల తర్వాత ఫ్రాన్స్‌కు వెళ్లి స్థిరపడిన స్పాస్కీ ఆ తర్వాత 21 ఏళ్ల పాటు ఆ దేశం తరఫున పోటీల్లో పాల్గొన్నా చెప్పుకోదగ్గ ప్రభావం చూపలేకపోయాడు. 2013లో అతను తిరిగి స్వదేశానికి వచ్చేసి చివరి వరకు మాస్కోలోనే ఉండిపోయాడు. స్పాస్కీతో సమరంతో 1972లో జగజ్జేతగా నిలిచిన బాబీ ఫిషర్‌ 2008లోనే మరణించాడు.
చదవండి: Champions Trophy: సెమీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్‌..   

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు