Breaking News

విధ్వంసం సృష్టించిన రస్సెల్.. ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు! వీడియో వైరల్‌

Published on Sun, 08/28/2022 - 12:12

వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రస్సెల్ మరోసారి విధ్వంసం సృష్టించాడు. కరిబీయన్‌ దేశీవాళీ టోర్నీ 'సిక్స్‌టీ' టీ10 లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌కు రస్సెల్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ లీగ్‌లో​భాగంగా శనివారం సెయింట్ కిట్స్, ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జట్లు వార్నర్‌ వేదికగా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో రస్సెల్ ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు.

రస్సెల్ కేవలం 24 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 72 పరుగులు సాధించాడు. కాగా ఇదే మ్యాచ్‌లో రస్సెల్‌  వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాది సునామీ సృష్టించాడు. ఈ టోర్నీ రూల్స్‌ ప్రకారం.. ఏ బ్యాటర్‌ అయితే ఓవర్‌ ఆఖరి బంతికి స్ట్రైక్‌లో ఉంటాడో తరువాతి ఓవర్‌ తొలి బంతిని ఆ బ్యాటరే ఎదుర్కొంటాడు.

ఈ క్రమంలో నైట్ రైడర్స్ ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్‌ వేసిన డొమానిక్‌ డ్రేక్స్‌ బౌలింగ్‌లో అఖరి నాలుగు బంతులకు నాలుగు సిక్స్‌లు బాదిన రస్సెల్‌.. తర్వాతి ఓవర్‌ వేసిన జోన్-రస్ జగ్గేసర్ బౌలింగ్‌లో తొలి రెండు బంతులను రస్సెల్‌ సిక్సర్లగా మలిచాడు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. రస్సెల్ తుపాన్‌ ఇన్నింగ్స్‌ ఫలితంగా నైట్ రైడర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో సెయింట్ కిట్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 152 పరుగులు మాత్రమే చేయగల్గింది. తద్వారా నైట్ రైడర్స్ చేతిలో సెయింట్ కిట్స్ మూడు పరుగుల తేడాతో పరాజాయం పాలైంది.
చదవండి: Asia Cup Ind Vs Pak: పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌.. దినేష్‌ కార్తీక్‌కు నో ఛాన్స్‌!

Videos

కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్

హైదరాబాద్ లో కరోనా కేసు నమోదు

జహీరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్

ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ విచారం

YSRCP హరికృష్ణను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి.. దారుణం! : Ambati Rambabu

Sake Sailajanath: ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు

First case: కడప కరోనా కేసును దాచిపెట్టేందుకు అధికారుల యత్నం

హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ సర్కార్ 6 షరతులు

Chittoor: మామిడి రైతుల ఆవేదన..చేతులెత్తేసిన కూటమి

West Godavari: పేదల కల కలగానే మిగిలింది పడకేసిన ఇళ్ల నిర్మాణ పనులు

Photos

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)