Breaking News

‘అలా క్యాచ్‌ పడితే నాటౌట్‌’

Published on Sun, 06/15/2025 - 01:24

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న కొన్ని నిబంధనల్లో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మార్పులు చేసింది. వన్డేల్లో రెండు బంతుల వినియోగం, కన్‌కషన్‌ సబ్‌స్టిట్యూట్, బౌండరీ లైన్‌ వద్ద పట్టే క్యాచ్‌లు వివాదాస్పదం కాకుండా ఉండేదుకు ఐసీసీ క్రికెట్‌ కమిటీ సిఫార్సుల మేరకు సవరణలు తీసుకొచ్చింది.

టెస్టు, వన్డే, టి20 మూడు ఫార్మాట్లలోనూ ఈ కొత్త సవరణ నిబంధనలు త్వరలోనే అమలు కానున్నట్లు ఐసీసీ వెల్లడించింది. ఈ నెల 17 నుంచే టెస్టు క్రికెట్‌లో ఇవి అమలవుతాయి. వచ్చే నెల 2 నుంచి వన్డేల్లో, 10 నుంచి టి20 క్రికెట్‌లో మారిన నిబంధనల్ని అమలు చేయనున్నట్లు ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది.  

రెండు కొత్త బంతులు యథాతథం కానీ... 
ఇప్పుడు వన్డే క్రికెట్‌లో బౌలింగ్‌ జట్టుకు రెండు కొత్త బంతుల్ని ఒకేసారి ఇస్తున్నారు. ఒక ఎండ్‌ నుంచి ఒక బౌలర్, మరో ఎండ్‌ నుంచి ఇంకో బౌలర్‌ రెండు వేర్వేరు కొత్త బంతుల్ని వినియోగిస్తున్నారు. ఇకపై ఇలా ఉండదు. రెండు కొత్త బంతుల్ని ఒకేసారి ఇచి్చనప్పటికీ చెరో ఎండ్‌ నుంచి ఉపయోగించడం కుదరదు. 

రెండు ఎండ్‌ల నుంచి కూడా 1 నుంచి 34 ఓవర్ల వరకు ఒక కొత్త బంతిని, 35 నుంచి 50వ ఓవర్‌ వరకు రెండో కొత్త బంతిని వాడాల్సివుంటుంది. ఒకవేళ ప్రతికూల వాతావరణంతో 25 ఓవర్లలోపు కుదించిన మ్యాచ్‌లు జరిగితే మాత్రం ఒక ఇన్నింగ్స్‌ ముగిసేవరకు ఒకే కొత్త బంతిని ఇస్తారు. దీనివల్ల బంతి, బ్యాట్‌కు మధ్య సమతూకం పాటించినట్లవుతుందని ఐసీసీ కమిటీ తెలిపింది. 

ఎవరు వీడితే... అదే తరహా ఆటగాడే బరిలోకి 
కన్‌కషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా ఇన్నాళ్లు ఎవరిని పడితే వారిని మైదానంలోకి దించేవారు. మరీ ముఖ్యంగా బ్యాటింగ్, ఫీల్డింగ్‌ పరిస్థితులకు తగిన ఆటగాడిని వ్యూహాత్మకంగా మోహరించేవారు. ఇది ప్రత్యర్థి జట్టుకు ఇబ్బందికరంగా మారేది. ఈ ఏడాది ఇంగ్లండ్‌తో నాలుగో టి20 సందర్భంగా బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబే కన్‌కషన్‌ అయ్యాడు. 

అయితే అప్పటికే బ్యాటింగ్‌ ముగియడంతో భారత్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ హర్షిత్‌ రాణాను బరిలోకి దించింది. అతను (3/33) మ్యాచ్‌ను గెలిపించే స్పెల్‌తో అదరగొట్టాడు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు దీనిని మార్చేందుకు ఐసీసీ సిద్ధమైంది. 

ఇక మీదట ఎవరు గాయంతో అచేతన స్థితికి గురైతే కన్‌కషన్‌ సబ్‌స్టిట్యూట్‌ ఆ స్థాయి ఆటగాడిని బరిలోకి దించాలి. అంటే బ్యాటర్‌ కన్‌కషన్‌ అయితే మరో బ్యాటర్‌నే మైదానంలో ఆడించాలి. అలాగే వికెట్‌ కీపర్, పేసర్, స్పిన్నర్, ఆల్‌రౌండర్‌... ఇలా ఎవరు గాయపడితే అదే తరహా ఆటగాడే ఆడాలి. దీనికి సంబంధించి టాస్‌కు ముందు తుది జట్టు వివరాలు ఇచ్చేటపుడే వికెట్‌ కీపర్, బ్యాటర్, సీమర్, స్పిన్నర్, ఆల్‌రౌండర్‌లతో కూడిన జాబితాను ఇవ్వాల్సి ఉంటుంది.  

బౌండరీ ఆవల పదేపదే తచ్చాడితే ‘క్యాచ్‌’ కాదు! 
బ్యాటర్‌ భారీ సిక్సర్లకు ప్రయత్నించినపుడు బౌండరీ లైన్‌ వద్ద గాల్లోకి లేచి బంతిని లైన్‌కు ఇవతలే విసిరేసిన ఫీల్డర్‌ మళ్లీ బౌండరీ లైన్‌ లోపలికి వచ్చి క్యాచ్‌గా అందుకునేవాడు. ఇందులో వివాదాస్పదం ఏమీ లేదు. అయితే కొన్ని అరుదైన సందర్భాల్లో ఫీల్డర్‌ బంతిని గాల్లోకి విసిరే ప్రయత్నంలో విఫలమవుతాడు. 

ఫీల్డర్‌ బౌండరీ లైన్‌ అవతల కాలు మోపాక కూడా మరోమారు గాల్లోకి ఎగిరి బంతిని మైదానంలోకి పంపి... తిరిగొచ్చి క్యాచ్‌ అందుకోవడం ఇకపై క్యాచ్‌ కాదు అవుట్‌ కాదు. ఈ వివాదాస్పద క్యాచ్‌లపై కమిటీ స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)