Breaking News

Paris Paralympics: భారత్‌ ఖాతాలో మరో పతకం.. రుబీనాకు కాంస్యం

Published on Sat, 08/31/2024 - 19:18

ప్యారిస్ వేదిక‌గా జ‌రుగుతున్న పారాలింపిక్స్‌లో భార‌త షూట‌ర్లు అద‌ర‌గొడుతున్నారు. షూటింగ్ విభాగంలో భార‌త్ ఖాతాలో మ‌రో ప‌త‌కం చేరింది. మ‌హిళ‌ల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 ఫైనల్ లో రుబీనా ఫ్రాన్సిస్ కాంస్య ప‌త‌కం సాధించింది. 

మధ్యప్రదేశ్‌కు చెందిన 25 ఏళ్ల రుబీనా.. ఫైన‌ల్లో 211.1 స్కోర్‌తో మూడో స్ధానంలో నిలిచి కాంస్యం ప‌త‌కం సొంతం చేసుకుంది.  ఇరాన్‌కు చెందిన సారే జవాన్‌మర్డి  236.8 స్కోరుతో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. 

ట‌ర్కీ షూట‌ర్ ఐసెల్ ఓజ్గాన్ రజతం కైవ‌సం చేసుకుంది. కాగా ఇప్పటివరకు ఈ పారాలింపిక్స్‌లో భారత్‌ మొత్తం ఐదు పతకాలు సాధించాయి. అందులో నాలుగు పతకాలు షూటర్లు సాధించినవే కావడం గమనార్హం. 

మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ స్టాండింగ్‌ ఎస్‌హెచ్‌-1 షూటింగ్‌ విభాగంలో అవని లేఖర స్వర్ణం సాధించిగా.. ఇదే ఈవెంట్‌లో  మోనా అగర్వాల్‌ కాంస్యం గెలుచుకుంది. పురుషుల షూటింగ్ 10మీ ఎయిర్ పిస్టల్ ఎస్ హెచ్‌1లో మనీష్ నర్వాల్ రజత పతకాన్ని సాధించాడు.


 

 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)