Breaking News

భళా బెంగళూరు...

Published on Tue, 02/18/2025 - 06:21

వడోదర: ఉమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) టి20 క్రికెట్‌ టోర్నిలో డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) దూసుకుపోతోంది. టోర్నీ తొలి పోరులో గుజరాత్‌ జెయింట్స్‌ను అలవోకగా ఓడించిన ఆర్‌సీబీ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. ఏకపక్షంగా సాగిన పోరులో గత ఏడాది రన్నరప్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది. 

ముందుగా పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేసిన ఆర్‌సీబీ... ఆ తర్వాత స్మృతి, వ్యాట్‌ దూకుడైన బ్యాటింగ్‌తో మరో 22 బంతులు మిగిలి ఉండగానే గెలుపు పూర్తి చేసుకుంది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఢిల్లీపై గెలిచింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 19.3 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటైంది. జెమీమా రోడ్రిగ్స్‌ (22 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, సారా బ్రైస్‌ (19 బంతుల్లో 23; 2 ఫోర్లు) కాస్త పోరాడింది.

 మిగతా బ్యాటర్లంతా విఫలం కావడంతో జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రేణుకా సింగ్‌ (3/23), జార్జియా వేర్‌హామ్‌ చెరో 3 వికెట్లు పడగొట్టగా...గార్త్, బిష్త్‌ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం బెంగళూరు 16.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. స్మృతి మంధాన (47 బంతుల్లో 81; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), డానీ వ్యాట్‌ (33 బంతుల్లో 42; 7 ఫోర్లు) తొలి వికెట్‌కు 65 బంతుల్లోనే 107 పరుగులు జోడించి జట్టు విజయాన్ని 
సునాయాసం చేశారు.  

స్కోరు వివరాలు  
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: లానింగ్‌ (సి) పెరీ (బి) గార్త్‌ 17; షఫాలీ (సి) స్మృతి (బి) రేణుక 0; జెమీమా (స్టంప్డ్‌) రిచా (బి) వేర్‌హామ్‌ 34; నెదర్లాండ్‌ (సి) స్మృతి (బి) రేణుక 19; కాప్‌ (సి) వ్యాట్‌ (బి) బిష్త్‌ 12; జొనాసెన్‌ (సి) కనిక (బి) బిష్త్‌ 1; బ్రైస్‌ (స్టంప్డ్‌) రిచా (బి) వేర్‌హామ్‌ 23; శిఖా (సి) బిష్త్‌ (బి) రేణుక 14; రాధ (సి అండ్‌ బి) వేర్‌హామ్‌ 0; అరుంధతి రెడ్డి (సి) పెరీ (బి) గార్త్‌ 4; మిన్ను మణి (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (19.3 ఓవర్లలో ఆలౌట్‌) 141. 

వికెట్ల పతనం: 1–1, 2–60, 3–62, 4–84, 5–87, 6–105, 7–130, 8–130, 9–132, 10–141. 
బౌలింగ్‌: రేణుక 4–0–23–3, కిమ్‌ గార్త్‌ 3.3–0–19–2, ఏక్తా బిష్త్‌ 4–0–35–2, జోషిత 2–0–21–0, వేర్‌హామ్‌ 4–0–25–3, కనిక 2–0–13–0. 

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: స్మృతి (సి) అరుంధతి (బి) శిఖా 81; డానీ వ్యాట్‌ (సి) జెమీమా (బి) అరుంధతి 42; ఎలీస్‌ పెరీ (నాటౌట్‌) 7; రిచా (నాటౌట్‌) 11; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (16.2 ఓవర్లలో 2 వికెట్లకు) 142. 
వికెట్ల పతనం: 1–107, 2–133. 
బౌలింగ్‌: కాప్‌ 2–0–27–0, శిఖా 4–0– 27–1, మిన్ను 1–0– 10–0, అరుంధతి 3.2–0–25–1, జొనాసెన్‌ 4–0–37–0, సదర్లాండ్‌ 2–0–18–0.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)