చిన్నస్వామిలో చిందేసేనా!

Published on Thu, 04/24/2025 - 03:16

బెంగళూరు: ఐపీఎల్‌ 18వ సీజన్‌లో ప్రత్యర్థుల మైదానాల్లో దుమ్మురేపుతున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) సొంతగడ్డ చిన్నస్వామి స్టేడియంలో మాత్రం విజయం కోసం నిరీక్షిస్తోంది. ఇప్పటి వరకు ఇక్కడ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిన బెంగళూరు... రాజస్తాన్‌ రాయల్స్‌పై అయినా గెలవాలని చూస్తోంది. తాజా సీజన్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లాడిన ఆర్‌సీబీ 5 విజయాలు, 3 పరాజయాలతో 10 పాయింట్లు ఖాతాలో వేసుకొని ప్లే ఆఫ్స్‌ వైపు దూసుకెళ్తుంటే... మరోవైపు రాజస్తాన్‌ రాయల్స్‌ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. 

గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడిన రాజస్తాన్‌ విజయం కోసం ఎదురుచూస్తోంది. మిగిలిన స్టేడియాలతో పోల్చుకుంటే కాస్త చిన్నదిగా ఉండే... చిన్నస్వామి మైదానంలో బెంగళూరు బ్యాటర్లు సమష్టిగా సత్తా చాటాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆశిస్తోంది. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఫుల్‌ఫామ్‌లో ఉండగా... సాల్ట్, పడిక్కల్, రజత్‌ పాటీదార్‌ నుంచి మరిన్ని మెరుపులు రావాల్సి ఉంది. 

రాజస్తాన్‌ రాయల్స్‌ రెగ్యులర్‌ సంజూ సామ్సన్‌ గాయంతో జట్టుకు దూరం కావడంతో... అతడి స్థానంలో రియాన్‌ పరా గ్‌ సారథిగా వ్యవహరించనున్నాడు. గత మ్యాచ్‌తోనే ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన 14 ఏళ్ల ప్లేయర్‌ వైభవ్‌ సూర్యవంశీపై అందరి దృష్టి నిలవనుంది.  

సొంతగడ్డపై ఓ విజయం కోసం! 
ఐపీఎల్‌ ఆరంభం నుంచి బరిలోకి దిగుతున్నా... ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ట్రోఫీ చేజిక్కించుకోలేకపోయిన ఆర్‌సీబీ... ఈసారి మెరుగైన ప్రదర్శనతో తమ చిరకాల కల నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. వరుస విజయాలు సాధించలేకపోతున్నా... మెరుగైన ప్రదర్శనతో ముందుకు సాగుతోంది. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి బెంగళూరు బౌలింగ్‌ దళం మెరుగైన ప్రదర్శన చేస్తుండగా... బ్యాటర్లు ఫర్వాలేదనిపిస్తున్నారు. 

భువనేశ్వర్, యశ్‌ దయాళ్, హాజల్‌వుడ్, కృనాల్‌ పాండ్యా, సుయాశ్‌ శర్మతో కూడిన బౌలింగ్‌ బృందం ఆర్‌సీబీకి ప్రధాన బలంగా మారింది. ఇక బ్యాటింగ్‌లో స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లి చక్కటి ఆటతీరు కనబరుస్తుండగా... కెప్టెన్   రజత్‌ పాటీదార్‌ నుంచి యాజమాన్యం మరింత ఆశిస్తోంది. 

మిడిలార్డర్‌లో జితేశ్‌ శర్మ, రొమారియో షెఫర్డ్, డేవిడ్, కృనాల్‌ కీలకం కానున్నారు. వీరంతా కలిసికట్టుగా కదంతొక్కితే బెంగళూరు భారీ స్కోరు చేయడం పెద్ద కష్టం కాదు. రాయల్స్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ నుంచి ఆర్‌సీబీకి ప్రధాన సవాలు ఎదురుకానుంది.  

అందరి చూపు... వైభవ్‌ వైపు 
మాజీ చాంపియన్‌ రాజస్తాన్‌ రాయల్స్‌ ఈ సీజన్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోతోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన రాయల్స్‌... ఆ తర్వాత రెండు మ్యాచ్‌లు నెగ్గింది. అనంతరం ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ రాజస్తాన్‌కు పరాజయాలే పలకరించాయి. ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన స్థితిలో బెంగళూరుతో పోరుకు రెడీ అయింది. బౌలర్ల ఫామ్‌ లేమి, బ్యాటర్ల నిలకడ లేమికి తోడు... కెప్టెన్   సామ్సన్‌ గాయం రాజస్తాన్‌ను ఇబ్బంది పెడుతోంది. 

ఈ నేపథ్యంలో ఆ జట్టుకు సానుకూల అంశం ఏదైనా ఉంది అంటే... గత మ్యాచ్‌ ద్వారానే ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన వైభవ్‌ సూర్యవంశీ. తొలి పోరులో అంతర్జాతీయ బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్న ఈ 14 ఏళ్ల బుడ్డోడు... ఆడిన మొదటి బంతికే సిక్స్‌ కొట్టి సంచలనం రేపాడు. క్రీజులో ఉన్నంతసేపు లక్నో బౌలర్లను ఓ ఆటాడుకున్న సూర్యవంశీ అదే జోరు కొనసాగించాలని చూస్తున్నాడు. 

మరో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ మంచి ఫామ్‌లో ఉండగా... నితీశ్‌ రాణా, ధ్రువ్‌ జురెల్, హెట్‌మైర్, శుభమ్‌ దూబే రాణించాల్సిన అవసరముంది. అటు కెప్టెన్   గా, ఇటు మిడిలార్డర్‌ బ్యాటర్‌గా రియాన్‌ పరాగ్‌పై అదనపు బాధ్యతలు ఉన్నాయి. జోఫ్రా ఆర్చర్, తీక్షణ, సందీప్‌ శర్మ, తుషార్‌ దేశ్‌పాండే పేస్‌ బాధ్యతలు చూసుకోనుండగా... వణిండు హసరంగా స్పిన్‌ భారం మోయనున్నాడు.

33 ఐపీఎల్‌ చరిత్రలో బెంగళూరు, రాజస్తాన్‌ జట్లు ముఖాముఖిగా 33 సార్లు తలపడ్డాయి. 16 మ్యాచ్‌ల్లో బెంగళూరు, 14 మ్యాచ్‌ల్లో రాజస్తాన్‌ విజయం సాధించాయి. 3 మ్యాచ్‌లు రద్దయ్యాయి. రాజస్తాన్‌పై బెంగళూరు అత్యధిక స్కోరు 200కాగా, అత్యల్ప స్కోరు 70 పరుగులు. బెంగళూరుపై రాజస్తాన్‌ అత్యధిక స్కోరు 217కాగా, అత్యల్ప స్కోరు 58 పరుగులు.  

తుది జట్లు (అంచనా) 
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు: రజత్‌ పాటీదార్‌ (కెప్టెన్   ), ఫిల్‌ సాల్ట్, విరాట్‌ కోహ్లి, పడిక్కల్, జితేశ్‌ శర్మ, షెఫర్డ్, టిమ్‌ డేవిడ్, కృనాల్‌ పాండ్యా, భువనేశ్వర్‌ కుమార్, హాజల్‌వుడ్, యశ్‌ దయాళ్, సుయాశ్‌ శర్మ. 
రాజస్తాన్‌ రాయల్స్‌: రియాన్‌ పరాగ్‌ (కెప్టెన్   ), వైభవ్‌ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, నితీశ్‌ రాణా, ధ్రువ్‌ జురెల్, హెట్‌మైర్, శుభమ్‌ దూబే, హసరంగ, ఆర్చర్, తీక్షణ, తుషార్‌ దేశ్‌పాండే, సందీప్‌ శర్మ. 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)