Breaking News

ప్రేమకు ఎండ్‌కార్డ్‌.. గర్ల్‌ఫ్రెండ్‌తో రొనాల్డో పెళ్లి ఎప్పుడంటే?

Published on Mon, 08/03/2026 - 17:33

పోర్చుగల్‌ స్టార్‌ ఫుట్‌బాలర్‌ క్రిస్టియానో రొనాల్డో తన లాంగ్‌టైమ్‌ గర్ల్‌ఫ్రెండ్‌ జార్జినా రోడ్రిగ్వేజ్‌ను వివాహమాడనున్నాడు. ఆగస్టు 8న వీరి వివాహం రొనాల్డో జన్మించిన పోర్చుగీస్‌ ద్వీపం మదీరాలో జరగనున్నట్లు సమాచారం. ఫంచల్‌ కేథడ్రల్‌లో మత పెద్దల సమక్షంలో బైబిల్‌పై ప్రమాణాలు చేసిన అనంతరం రింగులు మార్చుకొని వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. అనంతరం ఫైవ్‌స్టార్‌ హోటల్‌ అయిన సావోయ్‌ ప్యాలెస్‌లో కుటుంబసభ్యులు, స్నేహితులకు ఘనంగా విందు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 

కాగా రొనాల్డో, రోడ్రిగ్వేజ్‌ రిసెప్షన్‌ పార్టీకి భారీ ఎత్తున సెలబ్రెటీలు రానున్నట్లు బ్రిటన్‌ మీడియా ఒక నివేదికలో తెలిపింది. అయితే వివాహ ప్రకటనను రొనాల్డో జంట అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే మొదట సింట్రాలోని క్వింటా డా రెగరలేరా ఎస్టేట్‌లో వీరి వివాహం జరగనున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ, తాజాగా రొనాల్డో పుట్టిన ప్రదేశమైన మదీరాలోనే అంరరంగ వైభవంగా పెళ్లి వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరి వివాహం కోసం ఆగస్టు 8న ఫంచల్‌ కేథడ్రల్‌ను రిజర్వ్‌ చేశారని, తమ పెళ్లికి వచ్చే అతిథుల కోసం కేథడ్రల్‌ పక్కనే ఉన్న పెద్ద హోటల్‌లో రెండు ఫ్లోర్లలో ఉన్న రూంలను కూడా బుక్‌ చేసినట్లు సమాచారం.

2016లో చిగురించిన ప్రేమ
క్రిస్టియానో ​​రొనాల్డో, జార్జినాల మధ్య 2016లో ప్రేమ చిగురించింది. మాడ్రిడ్‌లోని ఒక గూచీ స్టోర్‌లో జార్జినా సేల్స్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సమయంలో రొనాల్డో ఆమెను మొదటిసారి కలిశాడు. ఆ తర్వాత ఒక ఫ్యాషన్ ఈవెంట్‌లో మళ్లీ కలుసుకున్నఈ జంట డేటింగ్ మొదలుపెట్టింది. ఆ తర్వాత క్రమంగా తమ మధ్య ఉన్న బంధాన్ని బయటపెట్టారు. 2017 జనవరిలో జ్యూరిచ్‌లో జరిగిన 'ది బెస్ట్ ఫీఫా ఫుట్‌బాల్ అవార్డ్స్'లో వారు మొదటిసారి అధికారికంగా కలిసి కనిపించారు. ఆ తర్వాత అదే సంవత్సరం ఇన్‌స్టాగ్రామ్‌లో తమ మొదటి జంట ఫోటోను పంచుకున్నారు.

2017 నవంబర్‌లో ఈ ప్రేమికులకు కుమార్తె అలనా మార్టినా పుట్టింది. అలనాను పెంచడంతో పాటు, క్రిస్టియానో ​​జూనియర్, ఇవా, మాటియోల పెంపకంలో రోడ్రిగ్జ్‌ బిజీగా మారిపోయింది. 2022 ఏప్రిల్‌లో, ఈ దంపతులు కవల కుమార్తెలకు స్వాగతం పలికారు. ఇక 2025 ఆగస్టులో జార్జినా రోడ్రిగ్జ్‌ రొనాల్డో తొడిగిన ఉంగరాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ ‘నీ ప్రొపోజల్‌కు అంగీకరిస్తున్నా’ అని క్యాప్షన్‌ జత చేసి నిశ్చితార్థం జరిగినట్లు ధృవీకరించింది. అప్పటి నుంచి వీరి వివాహంపై ఊహాగానాలు వస్తున్న వేళ ఆగస్టు 8న వీరి వివాహం జరగనున్నట్లు వార్తలు రావడం అభిమానులను ఆనందంలో ముంచెత్తింది.

ఇక రొనాల్డో ఇటీవలే ఫిఫా ప్రపంచకప్‌లో పోర్చుగల్‌ తరఫున ఆడాడు. అయితే జట్టును ఫైనల్‌ చేర్చడంలో విఫలమయ్యాడు. ఈసారి ప్రిక్వార్టర్స్‌లోనే పోర్చుగల్‌ వెనుదిరిగింది. రికార్డు స్థాయిలో ఆరో ఫిఫా ప్రపంచకప్‌ ఆడిన రొనాల్డో వయసు 41 ఏళ్లు. కాబట్టి రొనాల్డో తన కెరీర్‌లో చివరి ఫిఫా ప్రపంచకప్‌ ఆడేసినట్లే.

 

 

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)

+5

IND Vs WI: హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో టీ20 జోష్‌ (ఫొటోలు)