Breaking News

విధ్వంసం సృష్టించిన ఆర్సీబీ స్టార్‌

Published on Thu, 06/26/2025 - 20:04

మేజర్‌ లీగ్‌ క్రికెట్‌లో ఆర్సీబీ స్టార్‌ ఆటగాడు, శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌ ఆల్‌రౌండర్‌ రొమారియో షెపర్డ్‌ చెలరేగిపోయాడు. సియాటిల్‌ ఓర్కాస్‌తో ఇవాళ (భారతకాలమానం ప్రకారం) జరిగిన మ్యాచ్‌లో విధ్వంసం​ సృష్టించాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 31 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 56 పరుగులు చేశాడు. అనంతరం బౌలింగ్‌లోనూ రెచ్చిపోయాడు. 3 ఓవర్లలో కేవల​ 16 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు.

షెపర్డ్‌ ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టడంతో శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌ సియాటిల్‌ ఓర్కాస్‌పై 32 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో డబుల్‌ హ్యాట్రిక్‌ విజయాలు సాధించిన యూనికార్న్స్‌ ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. షెపర్డ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. 

షెపర్డ్‌ తాజాగా ముగిసిన ఐపీఎల్‌ సీజన్‌లో సీఎస్‌కేపై 14 బంతుల్లో హాఫ్‌ సెంచరీ చేసి సంచలనం సృష్టించాడు. తాజాగా అదే తరహా ప్రదర్శన చేసి వార్తల్లో నిలిచాడు. ఈ ప్రదర్శన షెపర్డ్‌కు వచ్చే ఐపీఎల్‌ సీజన్‌ రిటెన్షన్‌కు ఉపయోగపడవచ్చు. షెపర్డ్‌ ప్రస్తుత ఎం​ఎల్‌సీ సీజన్‌లో ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపిస్తున్నాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన యూనికార్న్స్‌.. షెపర్డ్‌ (56), మాథ్యూ షార్ట్‌ (52) మెరుపు అర్ద సెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌ (34) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. 

మిగతా ఆటగాళ్లలో ఫిన్‌ అలెన్‌ (4), సంజయ్‌ కృష్ణమూర్తి (4), హసన్‌ ఖాన్‌ (1), జేవియర్‌ బార్ట్‌లెట్‌ (3), హ్యామిల్టన్‌ (6) నిరాశపరిచారు. ఓర్కాస్‌ బౌలర్లలో హర్మీత్‌ సింగ్‌, కొయెట్జీ తలో 3 వికెట్లు తీయగా.. ఒబెద్‌ మెక్‌కాయ్‌, గానన్‌ చెరో వికెట్‌ తీశారు.

అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన ఓర్కాస్‌.. హరీస్‌ రౌఫ్‌ (4-0-32-4) నిప్పులు చెరగడంతో 18.2 ఓవర్లలో 144 పరుగులకే ఆలౌటైంది. రౌఫ్‌కు మాథ్యూ షార్ట్‌ (4-0-12-3), షెపర్డ్‌ (3-0-16-2), బార్ట్‌లెట్‌ (2.2-0-37-1) కూడా జత కలవడంతో ఓర్కాస్‌ ఇన్నింగ్స్‌ పేకమేడలా కూలింది. 

ఓర్కాస్‌ జట్టులో ఓపెనర్‌ షయాన్‌ జహంగీర్‌ (40), షిమ్రోన్‌ హెట్‌మైర్‌ (30), డేవిడ్‌ వార్నర్‌ మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కైల్‌ మేయర్స్‌ (0), హెన్రిచ్‌ క్లాసెన్‌ (7) వైఫల్యాల పరంపరను కొనసాగించారు. ఈ సీజన్‌లో ఓర్కాస్‌కు ఇది వరుసగా ఐదో ఓటమి. ఈ ఓటమితో ఓర్కాస్‌ ప్లే ఆఫ్స్‌ అవకాశాలు దాదాపుగా గల్లంతైనట్లే.
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)