Breaking News

రోహిత్‌కు హైదరాబాద్ ఫ్యాన్స్ బర్త్‌డే గిఫ్ట్.. 60 అడుగుల భారీ కటౌట్

Published on Sun, 04/30/2023 - 15:42

రోహిత్‌ శర్మ.. భారత క్రికెట్‌ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయే పేరు. ఒక సాధారణ క్రికెటర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టి టీమిండియా కెప్టెన్‌గా ఎదిగిన రోహిత్‌ శర్మ గురించి ఎంతచెప్పుకున్న తక్కువే. తన కెరీర్‌లో ఎన్నో అవమానాలు దాటి భారత జట్టును నడిపించే స్థాయికి చేరుకున్న రోహిత్‌.. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

అభిమానులు ముద్దుగా హిట్‌మ్యాన్‌ అని పిలుచుకుంటారు. భారత్‌లో క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌, టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ, ప్రస్తుత తరం గొప్ప ఆటగాడిగా పేరున్న విరాట్ కోహ్లీలతో సమానంగా అదరణపొం‍దే ఏకైక ఆటగాడు హిట్‌మ్యాన్‌. రోహిత్‌ తన పేరిట ఎన్నో రికార్డులను లిఖించుకున్నాడు. ఒకే వన్డే వరల్డ్‌కప్‌లో 5 సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడు హిట్‌మ్యాన్‌ కావడం విశేషం.

అదే విధంగా ఐపీఎల్‌లో కూడా తనకంటూ ఓ ప్రత్యేక చరిత్రను రోహిత్‌ లిఖించుకున్నాడు. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో సారధిగా ఐదు సార్లు ముంబై ఇండియన్స్‌ను ఛాంపియన్‌గా నిలిచిన ఘనత రోహిత్‌ది. ఇక ఎన్నో అరుదైన ఘనతలు సాధించిన రోహిత్‌..ఆదివారం(ఏప్రిల్‌ 30) తన 36వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. దీంతో రోహిత్‌కు సోషల్‌మీడియా వేదికగా క్రికెటర్లతో పాటు అభిమానులు విషెస్‌ తెలుపుతున్నారు.

హైదరాబాద్‌లో భారీ కటౌట్‌..
ఇక రోహిత్‌ పుట్టింది ముంబైలో అయినప్పటికీ హైదరాబాద్‌లో మాత్రం  ప్రత్యేకమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. గతంలో ఐపీఎల్ ఆరంభ సీజన్లలో  రోహిత్ శర్మ హైదరాబాద్ ఫ్రాంఛైజీ డెక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడాడు. 2009లో టైటిల్ గెలిచిన జట్టులో సభ్యుడిగా కూడా ఉన్నాడు.

ఈ క్రమంలో రోహిత్‌ పుట్టినరోజును హైదరాబాద్‌లో అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏకంగా 60 అడుగుల రోహిత్ శర్మ కటౌట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు.  ఈ కటౌట్‌కు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్రికెట్‌ చరిత్రలో ఏ క్రికెటర్‌కు కూడా ఇంత పెద్ద కటౌట్‌ పెట్టలేదు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)