Breaking News

రోహిత్‌ శర్మను ఉద్దేశించి కపిల్‌ దేవ్‌ వ్యాఖ్యలు.. నీ కోసం..

Published on Wed, 11/22/2023 - 18:16

భారత్‌లో క్రికెట్‌ రూపురేఖలను మార్చి వేసిన ఘనత కపిల్‌ డెవిల్స్‌కే దక్కుతుందనడంలో అతిశయోక్తి లేదు. వన్డే వరల్డ్‌కప్‌-1983లో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన కపిల్‌దేవ్‌ సేన.. అనూహ్య రీతిలో చాంపియన్‌గా నిలిచింది.

ఇంగ్లండ్‌ గడ్డ మీద.. అప్పటికే రెండుసార్లు విజేత అయిన వెస్టిండీస్‌ను ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. అలా టీమిండియాకు తొలి ఐసీసీ ట్రోఫీ అందించిన జట్టుగా చరిత్రలో నిలిచిపోయింది.

ఈ క్రమంలో 2011లో సొంతగడ్డ మీద ధోని సేన మరోసారి వన్డే ప్రపంచకప్‌ గెలిచి.. ఆ మ్యాజిక్‌ను రిపీట్‌ చేసింది. పుష్కరకాలం తర్వాత రోహిత్‌ బృందం కూడా అదే పునరావృతం చేస్తుందని భావించిన అభిమానులకు మాత్రం నిరాశే ఎదురైంది.

వన్డే వరల్డ్‌కప్‌-2023లో అజేయ రికార్డుతో ఫైనల్‌తో దూసుకెళ్లిన టీమిండియా.. ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ఐదుసార్లు చాంపియన్‌ ఆస్ట్రేలియా చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి చెందింది. దీంతో భారత ఆటగాళ్లతో పాటు అభిమానుల హృదయాలు కూడా ముక్కలయ్యాయి.

ఆస్ట్రేలియా ఆరోసారి జగజ్జేతగా నిలిచిన సంబరంలో మునిగిపోతే.. టీమిండియా కన్నీటితో మైదానాన్ని వీడింది. ఈ నేపథ్యంలో అభిమానులంతా రోహిత్‌ సేనకు మద్దతుగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతూ ఓదార్చే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో ​మాజీ కెప్టెన్‌, టీమిండియా దిగ్గజం కపిల్‌ దేవ్‌.. రోహిత్‌ శర్మను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ‘‘రోహిత్‌.. ఇప్పటికే నువ్వు చేసే పనిలో మాస్టర్‌వి అయిపోయావు.

నీకోసం ఇంకెన్నో విజయాలు ఎదురుచూస్తున్నాయి. ఇలాంటివి మనసుకు బాధ కలిగిస్తాయని నాకు తెలుసు. కానీ నువ్వు నమ్మకం కోల్పోవద్దు’’ అంటూ రోహిత్‌ కళ్లలో నీళ్లు నిండిన ఫొటోను కపిల్‌ షేర్‌ చేశాడు.

ఇక జట్టును ఉద్దేశిస్తూ.. ‘‘ఇండియా మొత్తం నీతో ఉంది. మీరంతా చాంపియన్సే బాయ్స్‌. తలెత్తుకోండి. ట్రోఫీ గెలవాలన్నది మీ అంతిమ లక్ష్యం. కానీ దానితో పనిలేకుండానే మీరు ఇప్పటికే విజేతలుగా నిలిచారు. దేశం మిమ్మల్ని చూసి గర్వపడుతోంది’’ అని కపిల్‌ దేవ్‌ బాసటగా నిలిచాడు. 

Videos

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

లక్ష్మణ్ తో BCCI కీలక మీటింగ్ టెన్షన్ లో గంభీర్, అగార్కర్

LIC కొత్త పాలసీ.. బెనిఫిట్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు

KA పాల్ బంపర్ ఆఫర్

Kurnool: SV మోహన్ రెడ్డి తనయుడి రిసెప్షన్ కు హాజరైన YS జగన్

ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!

ధనుష్ పార్టీకిలోకి TVK మంత్రి..?

DSC స్కామ్ బట్టబయలు లోకేష్ కి ఇచ్చిపడేసిన వరుదు కళ్యాణి

మళ్లీ భారీగా పెరిగిన బంగారం ఎంత పెరిగిందంటే..!

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)