Breaking News

రోహిత్ ప్రాక్టీస్ ఆపేయ్‌.. ఫస్ట్ ఆ పనిచేయు: భారత మాజీ క్రికెటర్‌

Published on Sat, 02/08/2025 - 18:08

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్‌-2024 తర్వాత రోహిత్ శర్మ ఆటతీరు పేలవంగా మారిపోయింది. టెస్టులు, వన్డేల్లో హిట్‌మ్యాన్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో దారుణంగా విఫలమైన రోహిత్‌.. ఇప్పుడు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో అదే తీరును కనబరుస్తున్నాడు.

నాగ్‌పూర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో కేవలం 2 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఒకప్పుడు షార్ట్‌ పిచ్‌ బంతులను అలోవకగా సిక్సర్లగా మలిచిన రోహిత్‌.. ఇప్పుడు అదే బంతులకు ఔట్ అవుతుండడం అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. 

ముఖ్యంగా కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రోహిత్ తన ఫామ్‌ను అందుకోవాలని సగటు భారత అభిమాని కోరుకుంటున్నాడు. ఈ క్రమంలో రోహిత్‌కు భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కీలక సూచనలు చేశాడు.  రోహిత్ శర్మ తన రిథమ్‌ను తిరిగి పొందడానికి గతంలో తను ఆడిన వీడియోలు చూడాలని బంగర్ అభిప్రాయపడ్డాడు.

"రోహిత్ శర్మ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. తన కెరీర్‌లో పరుగులు చేయని దశను అనుభవిస్తున్నాడు. అయితే అతడు తన ఫామ్‌ను తిరిగి అందుకోవడానికి ఎక్కువగా నెట్స్‌లో శ్రమిస్తున్నాడు. కానీ కొన్నిసార్లు ఎక్కువగా సాధన చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. అతడు ఒంటరిగా ఉండి బ్యాటర్‌గా తన గత విజయాలను గుర్తు చేసుకోవాలి. 

గతంలో తన బ్యాటింగ్ చేసిన వీడియోలను చూడాలి. ప్ర‌స్తుతం ఎక్కడ తప్పు జరుగుతుందో గుర్తించి సరిదిద్దుకోవాలి. కొన్ని సార్లు  ఇలా చేయడం ఫలితాన్ని ఇస్తోంది. ఒక్కసారి రిథమ్‌ను అందుకొంటే చాలు. అంతేకానీ ఎక్కువగా ఆలోచించి నిరాశలో కూరుకుపోకూడదు" అని బంగర్‌ పేర్కొన్నాడు. కాగా కటక్‌ వేదికగా భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య రెండో వన్డే ఆదివారం జరగనుంది. ఈ మ్యాచ్‌లోనైనా రోహిత్‌ తన బ్యాట్‌కు పనిచేబుతాడో లేదో చూడాలి. 

కాగా ఈ మ్యాచ్‌కు టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లి అందుబాటులో ఉండ‌నున్నాడు. గాయం కార‌ణంగా తొలి వ‌న్డేకు దూర‌మైన కోహ్లి.. ఇప్పుడు త‌న ఫిట్‌నెస్‌ను తిరిగిపొందాడు . ఈ విష‌యాన్ని భార‌త బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ ధ్రువీక‌రించాడు. కింగ్ ఎంట్రీతో య‌శస్వి జైశ్వాల్‌పై వేటు ప‌డే ఛాన్స్ ఉంది. 

రెండో వన్డేకు భారత తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్ (వైస్ కెప్టెన్‌), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీప‌ర్‌), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్
చదవండి: SL vs AUS: సూపర్ మేన్ స్మిత్‌.. ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్‌! వీడియో వైరల్‌
 

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)