Breaking News

రోహిత్ ముంబై ఇండియన్స్‌తోనే కొనసాగాలి.. ఎందుకంటే?

Published on Fri, 09/13/2024 - 09:10

ఐపీఎల్‌-2025 సీజ‌న్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ముంబై ఇండియ‌న్స్ ఫ్రాంచైజీకి గుడ్‌బై చెప్ప‌నున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది. కొంతమంది రోహిత్ శ‌ర్మ ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌కు వెళ్ల‌నున్నాడ‌ని, మ‌రి కొంతమంది ఢిల్లీ ఫ్రాంచైజీతో జ‌త‌కట్ట‌నున్నాడ‌ని చెప్పుకుంటూ వ‌స్తున్నారు. 

తాజాగా ఇదే విష‌యంపై మాజీ ఆటగాడు ప్రజ్ఞాన్ ఓజా తన అభిప్రాయాన్ని వెల్ల‌డించాడు. రోహిత్ శ‌ర్మ ముంబై ఇండియ‌న్స్‌లోనే కొన‌సాగాల‌ని ఓజా తెలిపాడు. కాగా హిట్‌మ్యాన్‌తో ఓజా మంచి అనుబంధం ఉంది. ఐపీఎల్‌లో ఓజా.. రోహిత్‌లో క‌లిసి నాలుగేళ్ల పాటు ముంబై ప్రాంఛైజీకి ప్రాతినిథ్యం వ‌హించారు.

"ముంబై ఇండియ‌న్స్‌తో రోహిత్‌కు మంచి అనుబంధం ఉంది. ముంబై ఫ్రాంచైజీలో రోహిత్‌ చాలా కాలం నుంచి అంతర్భాగంగా ఉన్నాడు. వారికి ఐదు టైట‌ల్స్‌ను అందించాడు. రోహిత్‌ని వదిలివేయడం వారికి సులభమో కాదో నాకు తెలియదు.

కానీ రోహిత్‌కి మాత్రం చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. నాకు తెలిసినంతవరకు రోహిత్ కూడా ముంబై ఫ్రాంచైజీని విడిచిపెట్టాల‌ని అనుకోడు. ఒకవేళ అదే జరిగితే కఠిన నిర్ణయమనే చెప్పవచ్చు. నా వ‌ర‌కు అయితే ముంబై ఇండియ‌న్స్‌లో రోహిత్ కొన‌సాగితేనే బెట‌ర్‌. 

అతడు ఈ స్థాయికి ఎదగడంలో ముంబై ఇండియన్స్ పాత్ర కూడా ఉంది. అందుకే అతడు ముంబై ఫ్రాంచైజీలోనే కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఇది ఫ్రాంచైజీ క్రికెట్ టోర్నమెంట్‌, కొన్ని సార్లు ఏదైనా జరగవచ్చు" అని ఇన్‌సైడ్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓజా పేర్కొన్నాడు.
చదవండి: టెస్టుల్లో రీఎంట్రీ ఇవ్వనున్న హార్దిక్‌ పాండ్యా ..?

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)