Breaking News

CSK Vs MI: శెభాష్‌ హిట్‌మ్యాన్‌.. ఓడినా గానీ! రోహిత్‌ శర్మ సూపర్‌ సెంచరీ

Published on Sun, 04/14/2024 - 23:58

ఐపీఎల్‌-2024లో ముంబై ఇండియన్స్‌ నాలుగో ఓటమి చవిచూసింది. వాంఖడే వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో ముంబై పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఓటమి పాలైనప్పటికి ఆ జట్టు స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.

207 పరుగుల లక్ష్య చేధనలో ఓ వైపు క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నప్పటికి రోహిత్‌ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. ఆఖరి వరకు అద్బుతమైన పోరాటం​ చేసినప్పటికి తన జట్టును మాత్రం హిట్‌మ్యాన్‌ గెలిపించలేకపోయాడు. రోహిత్‌కు మరో ఆటగాడి సపోర్ట్‌ ఉండి ముంబై కచ్చితంగా విజయం సాధించిండేది.

రోహిత్‌ సెంచరీ చేసినప్పటికి ఎటువంటి సెలబ్రేషన్స్‌ కూడా జరుపుకోలేదు. రోహిత్‌ సెంచరీ వృథాగా మిగిలిపోయింది. 63 బంతుల్లో హిట్‌మ్యాన్‌.. 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 103 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రోహిత్‌కు ఇది రెండో ఐపీఎల్‌ సెంచరీ. రోహిత్‌ శర్మ చివరగా 2012 ఐపీఎల్‌ సీజన్‌లో సెంచరీ సాధించాడు.

ఇక ఈ మ్యాచ్‌లో 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులకే పరిమితమైంది.  సీఎస్‌కే బౌలర్లలో పతిరాన అద్బుతమైన బౌలింగ్‌ ప్రదర్శన కనబరిచాడు. తన 4 ఓవర్ల కోటాలో 28 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన పతిరానకు ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)