Breaking News

రోహిత్‌ శర్మ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్‌ చరిత్రలోనే

Published on Sat, 05/04/2024 - 16:58

ఐపీఎల్‌-2024లో టీమిండియా కెప్టెన్‌, ముంబై ఇండియ‌న్స్ స్టార్ ఓపెనర్ రోహిత్ శ‌ర్మ త‌న మార్క్‌ను చూపించ‌లేక‌పోతుకున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా శుక్ర‌వారం వాఖండే వేదిక‌గా కోల్‌కతా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రోహిత్ నిరాశ‌ప‌రిచాడు. 

ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా వ‌చ్చిన హిట్‌మ్య‌న్‌.. కేకేఆర్ బౌల‌ర్ల‌ను ఎదుర్కోవ‌డానికి తీవ్రంగా క‌ష్ట‌ప‌డ్డాడు.ఈ క్ర‌మంలో కేవ‌లం 11 ప‌రుగులు మాత్ర‌మే చేసి కేకేఆర్ స్పిన్న‌ర్ సునీల్ న‌రైన్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. కాగా ఐపీఎల్‌లో నరైన్ బౌలింగ్‌లో  రోహిత్  ఔట్ కావ‌డం ఇది ఎనిమిదో సారి.

దీంతో రోహిత్ శ‌ర్మ ఓ చెత్త రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌ చరిత్రలో ఒకే బౌలర్‌ చేతిలో అత్యధిక సార్లు ఔట్ అయిన బ్యాటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. అంతకుముందు రోహిత్‌ శర్మ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా చేతిలో కూడా 7 సార్లు ఔటయ్యాడు. 

రోహిత్‌ పాటు ఎంఎస్‌ ధోని, విరాట్‌ కోహ్లి, అంబటి రాయుడు, రాబిన్‌ ఉతప్ప, రిషబ్‌ పంత్‌, రహానే కూడా 7 సార్లు ఒకే బౌలర్‌ చేతిలో ఔటయ్యాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ముంబై ఇండియన్స్‌పై కేకేఆర్‌ 24 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)