Breaking News

Funny Moment: పాపం.. రోహిత్‌ శర్మ ప్యాంట్‌ జారిపోయింది..!

Published on Mon, 04/15/2024 - 12:07

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య నిన్న (ఏప్రిల్‌ 14) జరిగిన మ్యాచ్‌ సందర్భంగా ఓ ఫన్నీ ఇన్సిడెంట్‌ జరిగింది. చెన్నై ఇన్నింగ్స్‌ 12వ ఓవర్‌లో రుతురాజ్‌ గైక్వాడ్‌ క్యాచ్‌ పట్టుకునే క్రమంలో రోహిత్‌ శర్మ ప్యాంట్‌ జారిపోయింది. క్యాచ్‌ కోసం హిట్‌మ్యాన్‌ శాయశక్తులా ప్రయత్నించినా అది దొరకపోగా ప్యాంట్‌ జారిపోయింది.

కిందపడిన బంతిని త్రో చేసిన అనంతరం రోహిత్‌ తన ప్యాంట్‌ను సర్దుకున్నాడు. ఈ ఫన్నీ ఇన్సిడెంట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. రోహిత్‌ కమిట్‌మెంట్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. లేటు వయసులో హిట్‌మ్యాన్‌ క్యాచ్‌ కోసం శాయశక్తులా ప్రయత్నించాడని కితాబునిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ అజేయ సెంచరీతో (63 బంతుల్లో 105 నాటౌట్‌; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) కదంతొక్కినప్పటికీ ముంబై ఇండియన్స్‌ ఓటమిపాలైంది. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే.. రుతురాజ్‌ (40 బంతుల్లో 69; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), శివమ్‌ దూబే (38 బంతుల్లో 66 నాటౌట్‌; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్దసెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్‌లో ధోని సుడిగాలి ఇన్నింగ్స్‌తో శివాలెత్తిపోయాడు. ఇన్నింగ్స్‌లో చివరి నాలుగు బంతులు మిగిలున్నప్పుడు బరిలోకి దిగిన ధోని.. హ్యాట్రిక్‌ సిక్సర్లు సహా 20 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. హార్దిక్‌ పాండ్యా వేసిన ఈ ఓవర్‌లో సీఎస్‌కే ఏకంగా 26 పరుగులు పిండుకుని భారీ స్కోర్‌ చేసింది. 

అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. రోహిత్‌ శర్మ శతక్కొట్టినప్పటికీ లక్ష్యానికి 21 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. ధోని ఆఖరి ఓవర్‌లో చేసిన 20 పరుగులే ముంబై, సీఎస్‌కే స్కోర్లకు వ్యత్యాసం కావడం విశేషం. ఆఖరి ఓవర్‌లో 26 పరుగులు సమర్పించుకుని ముంబై ఓటమికి ప్రధాన కారణంగా నిలిచిన హార్దిక్‌పై ముంబై అభిమానులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. 4 వికెట్లు తీసిన పతిరణ సీఎస్‌కే గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)