Breaking News

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తాచాటిన రోహిత్‌ శర్మ.. కోహ్లిని వెనక్కి నెట్టి

Published on Wed, 10/18/2023 - 15:17

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సత్తాచాటాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన బ్యాటర్ల ర్యాంకింగ్‌లో రోహిత్‌ శర్మ ఆరో స్ధానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌-2023లో అదరగొడుతున్న రోహిత్‌.. ఏకంగా ఐదు స్ధానాలు ఎగబాకి ఆరో స్ధానాన్ని సొంతం చేసుకున్నాడు. ఆఫ్గానిస్తాన్‌పై సెంచరీతో చెలరేగిన హిట్‌మ్యాన్‌.. పాకిస్తాన్‌పై కూడా 86 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

ఈ నేపథ్యంలోనే రోహిత్‌ తన ర్యాంక్‌ను మెరుగుపరుచుకున్నాడు. కాగా ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లిని తొలిసారి రోహిత్‌ అధిగమించాడు. కోహ్లి ప్రస్తుతం 9వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.

ఇక నెం1 ర్యాంక్‌లో పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం ఉండగా.. రెండో స్ధానంలో టీమిండియా యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ నిలిచాడు. అదే విధంగా ఈ మెగా టోర్నీలో రెండు వరుస సెంచరీలతో చెలరేగిన దక్షిణాఫ్రికా స్టార్‌ ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌.. వన్డే ర్యాంకింగ్స్‌లో మూడు స్ధానాలు ఎగబాకి 3వ స్ధానానికి చేరుకున్నాడు.
చదవండి: Netherlands Cricket: అనలిస్ట్‌లు లేరు, పరిమిత కిట్‌లు కూడా లేవు.. అయినా నిరుత్సాహపడలేదు

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య