Breaking News

రోహిత్‌ ఫామ్‌లోకి రావాలంటే అదొక్కటే మార్గం: స్మిత్‌

Published on Mon, 06/19/2023 - 07:53

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గత కొంత కాలంగా పేలవ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా అంతగా రాణించలేకపోయాడు. అంతేకాకుండా ఈ తుది పోరులో కెప్టెన్‌గా కూడా రోహిత్‌ విఫలమయ్యాడు.  ఈ క్రమంలో రోహిత్‌ను టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పించి మరోకరికి జట్టు పగ్గాలు అప్పజెప్పాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో రోహిత్‌ శర్మను ఉద్దేశించి దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌ కీలక వాఖ్యలు చేశాడు. రోహిత్‌కు ప్రస్తుతం తగినంత విశ్రాంతి అవసరమని గ్రేమ్‌ స్మిత్‌ అభిప్రాయపడ్డాడు. రోహిత్‌ తిరిగి గాడిలో పడాలంటే ఇదొక్కటే మార్గమని అతడు తెలిపాడు. 

"కెప్టెన్‌కి ఎదురయ్యే అతిపెద్ద సవాళ్లలో వారి వ్యక్తిగత ప్రదర్శన ఒకటి. జట్టును నడిపించే వాడికి ఎప్పుడూ ఒత్తిడి ఉండే ఉంటుంది. నా వరకు అయితే రోహిత్‌కు ప్రస్తుతం విశ్రాంతి అవసరం. అతడు రిఫ్రెష్ కావాలి. అతడు ఏ ఫార్మాట్‌లో కూడా నిలకడగా ఆడటం లేదు. ఐపీఎల్‌, డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కూడా అదే తీరు కనబరిచాడు.

అతడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. అందరూ అతడి వ్యక్తిగత ప్రదర్శన పట్ల విమర్శలు కురిపిస్తున్నారు తప్ప కెప్టెన్సీ పై కాదు. అతడు తన ఫామ్‌ను తిరిగి పొందడం ప్రస్తుతం భారత జట్టుకు ఎంతో అవసమని" టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్మిత్‌ పేర్కొన్నాడు.
చదవండి: CWC Qualifiers 2023: వన్డేల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీ సాధించిన సీన్‌ విలియమ్స్‌

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)