మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం
Breaking News
కెప్టెన్స్ మీట్‌కు ముంబై సారథి డుమ్మా.. రోహిత్‌కు ఏమైంది?
Published on Thu, 03/30/2023 - 21:12
ఐపీఎల్-2023 మహాసంగ్రామం మార్చి 31 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఇక ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందు అహ్మదాబాద్ వేదికగా నిర్వహించిన కెప్టెన్స్ మీట్ లో 9 జట్ల సారథులు పాల్గొన్నారు. అయితే ఈ ప్రీ-ఐపీఎల్ కెప్టెన్ల మీట్‌కు ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ దూరమయ్యాడు.
రోహిత్ అనారోగ్యంతో ఉన్నందున ఈ ఫోటో షూట్‌కు హాజరు కాలేదని పలు నివేదికలు వెల్లడించాయి. అదే విధంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ఎంపికైన ప్రోటీస్ స్టార్ బ్యాటర్ ఐడైన్ మార్‌క్రమ్ కూడా ఈ ఫోటో షూట్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో ఎస్‌ఆర్‌హెచ్ వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ హాజరయ్యాడు.
కాగా నెదార్లాండ్స్‌తో దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ సందర్భంగా మార్‌క్రమ్ ఎస్‌ఆర్‌హెచ్ తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండడు. ఈ నేపథ్యంలో ఏప్రిల్2న రాజస్తాన్‌తో జరగనున్న మ్యాచ్‌కు ఎస్‌ఆర్‌హెచ్ సారథిగా భవీ వ్యవహరించనున్నాడు. ఇక ఏప్రిల్ 1న చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీతో జరగునున్న తొలి మ్యాచ్‌కు ముంబై కెప్టెన్ రోహిత్ అందుబాటుపై సందిగ్ధం నెలకొంది.
Tags : 1