Breaking News

టీమిండియాకు భారీ షాక్‌.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు గాయం

Published on Sun, 12/22/2024 - 09:25

మెల్‌బోర్న్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌ర‌గ‌నున్న నాలుగో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ షాక్ త‌గిలింది. నెట్ ప్రాక్టీస్ సెష‌న్‌లో భార‌త కెప్టెన్‌ రోహిత్ శ‌ర్మ గాయ‌ప‌డ్డాడు. బ్యాటింగ్ ప్రాక్టీస్‌ చేస్తుండగా రోహిత్ శర్మ మోకాలికి గాయమైంది. త్రోడౌన్ స్పెషలిస్ట్ దయాను ఎదుర్కొనే క్ర‌మంలో బంతి రోహిత్ ఎడమ మోకాలికి బ‌లంగా తాకిన‌ట్లు తెలుస్తోంది. 

దీంతో అత‌డు నొప్పితో విల్ల‌విల్లాడిన‌ట్లు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. వెంట‌నే అత‌డికి ఫిజియో ఐస్ ప్యాక్‌ను తెచ్చి మోకాలి మ‌ర్ధ‌న చేశాడు. ఆ త‌ర్వాత రోహిత్ త‌న ప్రాక్టీస్‌ను కొన‌సాగించిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే అత‌డి గాయంపై బీసీసీఐ మాత్రం ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

మ్యాచ్ ఆరంభానికి ముందు హిట్‌మ్యాన్ గాయంపై జ‌ట్టు మెనెజ్‌మెంట్ ఓ అంచ‌నాకు వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ అత‌డు దూర‌మైతే స‌ర్ఫ‌రాజ్ ఖాన్ లేదా ధ్రువ్ జురెల్ తుది జ‌ట్టులోకి వచ్చే అవ‌కాశ‌ముంది. అయితే ఈ సిరీస్‌లో రోహిత్‌ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు.

ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడిన హిట్‌మ్యాన్‌ మొత్తం నాలుగు ఇన్నింగ్స్‌లలోనూ సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యాడు. ఇక ఇది ఇలా ఉండగా.. రోహిత్‌ కంటే ముందు నెట్‌ ప్రాక్టీస్‌లో కేఎల్‌ రాహుల్‌ సైతం గాయపడ్డాడు. అతడి కుడి చేతి మణికట్టుకు బంతి తాకింది. అయితే అతడి గాయం తీవ్రమైనది కానట్లు తెలుస్తోంది. డిసెంబర్‌ 26 నుంచి ఈ బ్యాక్సింగ్‌ డే టెస్టు ఆరంభం కానుంది.
చదవండి: ధోని శిష్యుడి విధ్వంసం.. 20 సిక్స్‌లతో ఫాస్టెస్ట్ డ‌బుల్ సెంచ‌రీ

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)