Breaking News

ఏంటి రోహిత్ భ‌య్యా? ఆఖ‌రికి అత‌డి చేతిలో కూడా ఔట‌య్యావు (వీడియో)

Published on Mon, 12/23/2024 - 17:04

బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా డిసెంబ‌ర్ 26 నుంచి భార‌త్‌-ఆస్ట్రేలియా మ‌ధ్య నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. మెల్‌బోర్న్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఆట‌గాళ్లు తీవ్రంగా చెమటోడుస్తున్నారు. ఈ బ్యాక్సింగ్ డే టెస్టులో ఎలాగైనా గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సంపాదించాలని భార‌త జ‌ట్టు ప‌ట్టుద‌ల‌తో ఉంది.

అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్‌. ప్రాక్టీస్ సెష‌న్‌లో గాయ‌ప‌డిన కెప్టెన్ రోహిత్ శ‌ర్మ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. అత‌డు తిరిగి త‌న ప్రాక్టీస్‌ను ప్రారంభించాడు. అయితే త‌న ప్రాక్టీస్ తిరిగి మొద‌లుపెట్టిన హిట్‌మ్యాన్.. పార్ట్ టైమ్ బౌల‌ర్ దేవ్‌ద‌త్త్ ప‌డిక్క‌ల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ కావ‌డం గ‌మ‌నార్హం.

ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. ఇది చూసిన నెటిజ‌న్లు "ఏంటి రోహిత్ భ‌య్యా అత‌డి బౌలింగ్‌లో కూడా ఔట్ అయ్యావు" అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఒకే ఒక్క హాఫ్ సెంచ‌రీ..
కాగా ఈ సిరీస్‌లో ఇప్ప‌టివ‌ర‌కు రెండు టెస్టులు ఆడిన రోహిత్ శ‌ర్మ దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. మూడు ఇన్నింగ్స్‌లలో కేవ‌లం హిట్‌మ్యాన్ కేవ‌లం 19 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. ఈ ఒక్క సిరీస్ మాత్ర‌మే కాకుండా గ‌త ఏడాదిగా రోహిత్‌ గ‌డ్డు ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నాడు. 

తన‌చివరి 10 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ కేవలం ఒక్క‌ అర్ధ సెంచరీ మాత్రమే చేశాడు. అందులో ఆరుసార్లు సింగిల్ డిజిట్ స్కోర్‌కే రోహిత్ పరిమిత‌మ‌య్యాడు. క‌నీసం ఆస్ట్రేలియాతో ఆఖ‌రి రెండు మ్యాచ్‌ల‌లోనైనా రోహిత్ రాణించాల‌ని అత‌డి అభిమానులు కోరుకుంటున్నారు.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)