Breaking News

గిల్‌ది అవుటా.. నాటౌటా? రోహిత్‌ రియాక్షన్‌ వైరల్‌

Published on Sun, 06/11/2023 - 07:52

లండన్‌ వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ తుది అంకానికి చేరుకుంది. ఆఖరి రోజు విజయం కోసం భారత్‌కు మరో 280 పరుగులు కావాల్సి ఉండగా, ఆసీస్‌కు 7 వికెట్లు అవసరం.

కాగా 444 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆట ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లి (44), రహానే(20) పరుగులతో ఉన్నారు. అంతకుముందు ఆస్ట్రేలియా తమ  రెండో ఇన్నింగ్స్‌ను 8 వికెట్లకు 270 పరుగులవద్ద డిక్లేర్‌ చేసింది.

ఇక ఇది ఇలా ఉండగా.. రెండో ఇన్నింగ్స్‌లో గిల్‌ ఔటైన తీరు వివాదస్పదమైంది. టీమిండియా రెండో ఇన్నింగ్స్ 8వ ఓవర్ తొలి బంతిని శుభ్‍మన్ గిల్ ఎదుర్కొన్నాడు. ఆసీస్ పేసర్ స్కాట్ బోలండ్ బౌలింగ్ చేయగా.. శుభ్‍మన్ గిల్ బ్యాట్ ఎడ్జ్‌కు బంతి తగిలి గల్లీలో ఉన్న కామెరూన్ గ్రీన్‍కు క్యాచ్ వెళ్లింది.

క్యాచ్‌ తీసుకునే క్రమంలో డైవ్‌ చేసిన గ్రీన్‌ బంతిని అందుకున్నప్పటికి.. ఫోర్స్‌కు బంతిని నేలకు తాకించినట్లు కనిపించింది. దీంతో ఫీల్డ్ అంపైర్స్.. థర్డ్ అంపైర్‌కు రెఫర్ చేశారు. అల్ట్రాఎడ్జ్‌లో కెమెరా యాంగిల్‌ పరిశీలించగా గ్రీన్‌ బంతిని అందుకున్నప్పటికి నేలకు తాకించినట్లు కనిపించింది. కానీ థర్డ్ అంపైర్ చివరికి గిల్ ఔటయినట్టు ప్రకటించాడు. 

రోహిత్‌ శర్మ రియాక్షన్‌ వైరల్‌
ఇక గిల్‌ను థర్డ్ అంపైర్ ఔట్‌ అని ప్రకటించగానే నాన్ స్ట్రైక్‌లో ఉన్న రోహిత్‌ ఒక్కసారిగా షాకింగ్‌ రియాక్షన్‌ ఇచ్చాడు. గట్టిగా అరుస్తూ హిట్‌మ్యాన్‌ పక్కకు వెళ్లిపోయాడు. ఇక 444 పరుగుల భారీ లక్క్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు వీరిద్దరూ మంచి ఆరంభం ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో గిల్‌ వికెట్‌ కోల్పోవడం రోహిత్‌ను తీవ్ర నిరాశపరిచింది. కాగా వీరిద్దరూ తొలి వికెట్‌కు 41 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో గిల్‌ 18 పరుగులు చేయగా.. రోహిత్‌ శర్మ 43 పరుగులు చేశాడు.
చదవండి: WTC Final: గెలవకపోయినా పర్లేదు డ్రా చేసుకుంటే అదే గొప్ప!


 

Videos

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)