Breaking News

రితికా కంటే ముందు ఆమెతో ప్రేమలో రోహిత్‌?.. నన్‌గా మారిన నటి?!

Published on Sat, 06/28/2025 - 19:16

టీమిండియా వన్డే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) తన వ్యక్తిగత జీవితం గురించి ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్‌ ఓనమాలు దిద్దిన స్టేడియం పిచ్‌పైనే మోకాళ్లపై కూర్చుని ప్రేయసి రితికా (Ritika Sajdeh)కు ప్రేమను వ్యక్తపరిచినట్లు వెల్లడించాడు. ఆమె కూడా సంతోషంగా ఒప్పుకోవడంతో ఇద్దరం పెళ్లి బంధంతో ఒక్కటయ్యామని రోహిత్‌ శర్మ తన రొమాంటిక్‌ ప్రపోజల్‌ గురించి చెబుతూ నవ్వులు చిందించాడు.

ఇద్దరు పిల్లలు.. ముచ్చటైన కుటుంబం
మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ అతడి భార్య గీతా బస్రా కలిసి నిర్వహిస్తున్న యూట్యూబ్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూకు భార్య రితికాతో కలిసి హాజరైన రోహిత్‌ ఈ విషయాన్ని వెల్లడించాడు. కాగా రోహిత్‌- రితికా చాలా ఏళ్ల పాటు డేటింగ్‌ చేసి.. 2015, డిసెంబరు 13న పెళ్లిపీటలు ఎక్కారు. వీరికి కూతురు సమైరా, కుమారుడు అహాన్‌ సంతానం.

తెరపైకి సోఫియా హయత్‌ పేరు
ఇక రోహిత్‌ శర్మ తన ప్రేమకథ గురించి వివరించిన నేపథ్యంలో గతంలో అతడు డేటింగ్‌ చేసిన అమ్మాయిల గురించి కూడా సోషల్‌ మీడియాలో చర్చ మొదలైంది. ఈ క్రమంలో ప్రధానంగా తెరపైకి వచ్చిన పేరు సోఫియా హయత్‌ (Sofia Hayat).

లండన్‌లో కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా సోఫియా- రోహిత్‌లకు పరిచయమైంది. తొలిచూపులోనే రోహిత్‌ను ఇష్టపడ్డ సోఫియా అతడితో డేటింగ్‌ చేసిందనే ప్రచారం ఉంది. అయితే, ప్రేమలో ఉన్నపుడు ఇద్దరూ కూడా ఈ విషయం గురించి బయటపెట్టలేదు. కానీ.. మీడియాలో వీరి గురించి వార్తలు రాగా.. 2012లో సోఫియా స్వయంగా స్పందించింది.

నేను రోహిత్‌ శర్మతో డేటింగ్‌ చేశా
‘‘ఇకనైనా వదంతులకు స్వస్తి పలుకుదాం. అవును.. నేను రోహిత్‌ శర్మతో డేటింగ్‌ చేశా. కానీ ఇప్పుడు అదంతా ముగిసిపోయింది.. ఇకపై జీవితంలో అతడితో మరోసారి డేటింగ్‌ చేయను. ఈసారి నేను మనసున్న మంచి వ్యక్తి కోసం మాత్రమే ఎదురుచూస్తున్నా’’ అని సోఫియా ట్వీట్‌ చేసింది.

అందుకే బ్రేకప్‌ చెప్పాను
అంతేకాదు.. రోహిత్‌ శర్మతో తన బంధం ముగిసిపోవడానికి గల కారణాన్ని వివరిస్తూ.. ‘‘అతడు మంచివాడు. కలిసి ఉన్నపుడు ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్లం. అయితే, అతడు బిడియస్తుడు. హోటల్స్‌, రూమ్స్‌ దగ్గర మేము మీడియా కంటపడకూడదని భావించేవాళ్లం.

కానీ మీడియాకు టిప్‌ అందింది. అపుడు మా మేనేజరే ఈ విషయం గురించి స్పందించారు. రోహిత్‌తో ఉన్న నాకున్న రిలేషన్‌పై గౌరవంతో నేనూ ఏమీ మాట్లాడలేదు. కానీ ఓసారి రోహిత్‌ మీడియాతో మాట్లాడుతున్నపుడు నా గురించి ప్రశ్న ఎదురుకాగా.. నేను కేవలం తన అభిమానిని మాత్రమే అని చెప్పాడు.

దాంతో నేను చాలా బాధపడ్డాను. అందుకే అతడితో బ్రేకప్‌ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతడితో ఉన్న అన్ని రకాల కాంటాక్టులను చెరిపివేశా’’ అని సోఫియా గతంలో ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. 

పెదవి విప్పని రోహిత్‌
అయితే, రోహిత్‌ మాత్రం ఆమెతో ప్రేమ, బ్రేకప్‌ గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే.. వివాదాలకు కేరాఫ్‌ అయిన సోఫియా.. విరాట్‌ కోహ్లి కోసం తాను రోహిత్‌ను వదిలేశానంటూ మరో ట్వీట్‌ చేసింది. దీన్ని బట్టి చూస్తే ఆమె ప్రచారం కోసమే ఇదంతా చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

నటి నుంచి నన్‌గా?
సోఫియా హయత్‌ బ్రిటిష్‌ మోడల్‌, సింగర్‌. ఆ తర్వాత టెలివిజన్‌ రంగంలోకి ప్రవేశించింది. హిందీ బిగ్‌బాస్‌ 7లో సోఫియా పాల్గొంది. 2013లో బిగ్‌ బ్రదర్‌ ఇండియన్‌ వర్షన్‌లోనూ తళుక్కుమంది. అయితే, 2016లో అందరికీ షాకిస్తూ... ఆధ్యాత్మిక బాటలో నడుస్తూ.. నన్‌గా మారినట్లు ప్రకటించింది. తన పేరును గైయా సోఫియా మదర్‌గా మార్చుకుంది. యోగా టీచర్‌, హీలర్‌గా తన ఇన్‌స్టాగ్రామ్‌ బయోలో పేర్కొంది.

చదవండి: ధావన్‌పై మండిపడ్డ రోహిత్‌ శర్మ.. షాకింగ్‌ విషయం బయటపెట్టిన గబ్బర్‌

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)