Breaking News

వారెవ్వా ‘హిట్‌’మ్యాన్‌!.. పేద కుటుంబంలో పుట్టి.. కోటీశ్వరుడిగా!.. ఆస్తి ఎంతంటే?

Published on Wed, 04/30/2025 - 11:22

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) నేడు (ఏప్రిల్‌ 30)లో 38వ వసంతం అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా హిట్‌మ్యాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఒకప్పుడు జట్టులో స్థానం కోసం ఎదురుచూసిన రోహిత్‌.. భారత్‌కు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన దిగ్గజ కెప్టెన్‌గా ఎదిగాడు.

మహేంద్ర సింగ్‌ ధోని (MS Dhoni) నాయకత్వంలో ఓపెనర్‌గా ప్రమోట్‌ అయిన తర్వాత తన విశ్వరూపం చూపించి.. ‘హిట్‌మ్యాన్‌’గా అభిమానుల గుండెల్లో, భారత క్రికెట్‌ చరిత్రలో తనదైన ముద్ర వేశాడు. టీ20 ప్రపంచకప్‌-2024 (T20 WC 2024)తో పాటు ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 (ICC Champions Trophy) గెలిచిన సారథిగా ప్రశంసలు అందుకున్న రోహిత్‌ కెరీర్‌, మేటి రికార్డులు, వ్యక్తిగత జీవితం, నికర ఆస్తుల విలువ తదితర వివరాలు.. అతడి బర్త్‌డే సందర్భంగా మీకోసం..

పేద కుటుంబంలో జన్మించిన రోహిత్‌
రోహిత్‌ శర్మ 1987, ఏప్రిల్‌ 30న మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జన్మించాడు. అతడి తల్లిదండ్రులు పూర్ణిమా శర్మ- గురునాథ్‌ శర్మ. పూర్ణిమా శర్మ విశాఖపట్నంకు చెందినవారు. ఇక రోహిత్‌కు తమ్ముడు విశాల్‌ శర్మ ఉన్నాడు.

పేద కుటుంబంలో జన్మించిన రోహిత్‌ శర్మ క్రికెట్‌ మీద మక్కువతో చిన్ననాటి నుంచే అనేక కష్టాలకోర్చాడు. అంచెలంచెలుగా ఎదిగి భారత జట్టులో స్థానం సంపాదించాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన రోహిత్‌.. ధోని కెప్టెన్సీలో ఓపెనర్‌గా ప్రమోట్‌ అయ్యాడు.

 ఏకైక ఆటగాడిగా రికార్డు
ఆ తర్వాత అతడికి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 273లు వన్డేలు, 159 టీ20లు, 67 టెస్టులు ఆడాడు. టెస్టుల్లో 4302, వన్డేల్లో 11168, టీ20లలో 4231 పరుగులు సాధించాడు.

వన్డేల్లో అత్యధికంగా మూడు డబుల్‌ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా రోహిత్‌ శర్మ కొనసాగుతున్నాడు. అంతేకాదు.. వన్డేల్లో అ‍త్యధిక వ్యక్తిగత స్కోరు (264) సాధించిన క్రికెటర్‌గా కూడా రోహిత్‌ చరిత్రకెక్కాడు. ఇక అంతర్జాతీయ టీ20లలోనూ అత్యధికంగా ఐదు శతకాలు బాదాడు. ఓవరాల్‌గా టీమిండియా తరఫున 47 సెంచరీలు చేశాడు. ఇవేగాక సిక్సర్ల వీరుడు రోహిత్‌ మరెన్నో ఘనమైన రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇక ఐపీఎల్‌లోనూ రోహిత్‌ శర్మకు తిరుగులేని రికార్డు ఉంది. ముంబై ఇండియన్స్‌ను ఏకంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపి.. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్‌గా చరిత్రపుటల్లో తన పేరు లిఖించుకున్నాడు. ఇప్పటికి 266 మ్యాచ్‌లలో కలిపి ఏకంగా 6868 పరుగులు సాధించాడు.

రితికా సజ్దేతో ఆరేళ్ల పాటు ప్రేమలో
ఇక స్పోర్ట్స్‌ ఈవెంట్‌ మేనేజర్‌గా పనిచేసిన రితికా సజ్దేతో ఆరేళ్ల పాటు ప్రేమలో ఉన్న రోహిత్‌ 2015, డిసెంబరు 13న ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు కుమార్తె సమైరా (2018), కుమారుడు అహాన్‌ సంతానం (2024).

నికర ఆస్తుల విలువ రూ. 218 కోట్లు
క్రికెటర్‌గా ఉన్నత శిఖరాలకు ఎదిగిన రోహిత్‌ శర్మ ఇటు ఆటగాడిగా, అటు పలు ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్‌గా.. ఐపీఎల్‌ ద్వారా కోట్లు ఆర్జించాడు. స్పోర్ట్స్‌కీడా నివేదిక ప్రకారం హిట్‌మ్యాన్‌ నికర ఆస్తుల విలువ రూ. 218 కోట్లు అని తెలుస్తోంది. బీసీసీఐ ఏ+ గ్రేడ్‌లో ఉన్న రోహిత్‌ ఏడాదికి రూ. 7 కోట్లు వేతనంగా పొందుతున్నాడు.

ఇక ఒక్కో టెస్టు మ్యాచ్‌కు రూ. 15 లక్షలు, వన్డేకు రూ. 6 లక్షలు, టీ20కి రూ. 3 లక్షలు బోర్డు ద్వారా ఫీజుగా అందుకుంటున్నాడు. ఐపీఎల్‌లో ముంబై కెప్టెన్‌గా కోట్లాది రూపాయలు ఆర్జించిన రోహిత్‌ శర్మను.. ఐపీఎల్‌-2025కి ముందు సదరు ఫ్రాంఛైజీ రూ. 16.3  కోట్లకు రిటైన్‌ చేసుకుంది.

లగ్జరీ ఇల్లు, కార్లు
రోహిత్‌ శర్మ ముంబైలో విలాసవంతమైన అపార్టుమెంట్లు ఉన్నాయి. వర్లిలో భార్యాబిడ్డలతో కలిసి హిట్‌మ్యాన్‌ నివసించే ఇంటి విలువ రూ. 30 కోట్లు అని జిక్యూ ఇండియా అంచనా వేసింది.

ఇక రోహిత్‌ శర్మ గ్యారేజీలో లంబోర్గిని ఉరుస్‌ (రూ. 4.18 కోట్లు), మెర్సిడెజ్‌ బెంజ్‌ (1.5 కోట్లు), మెర్సిడెజ్‌ జీఎఎల్‌ఎస్‌ 400 డి(రూ. 1.5 కోట్లు), బీఎండబ్ల్యూ ఎం5 (రూ. 1.79 కోట్లు) , రేంజ్‌ రోవర్‌ (రూ. 2.8 కోట్లు) వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి.

చదవండి: Kuldeep Slaps Rinku Singh: అతడిని బ్యాన్‌ చేయండి, టీమిండియా స్టార్‌పై నెటిజన్ల ఆగ్రహం
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)