Breaking News

IND-W Vs SL-W: భారత మహిళల శుభారంభం

Published on Thu, 06/23/2022 - 18:49

దంబుల్లా: ఫామ్‌ కోల్పోయి వన్డే ప్రపంచ కప్‌ జట్టుకు దూరమైన జెమీమా రోడ్రిగ్స్‌ ఇప్పుడు టి20ల్లో పునరాగమనంతో సత్తా చాటింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జెమీమా (27 బంతుల్లో 36 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ప్రదర్శనతో గురువారం జరిగిన తొలి టి20లో భారత మహిళల జట్టు 34 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది.

మరో ఓపెనర్‌ షఫాలీ వర్మ (31 బంతుల్లో 31; 4 ఫోర్లు) కూడా రాణించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌  20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన (1), ఆంధ్రప్రదేశ్‌ బ్యాటర్‌ సబ్బినేని మేఘన (0) విఫలం కాగా, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (20 బంతుల్లో 22; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది. చివర్లో దీప్తి శర్మ (8 బంతుల్లో 17 నాటౌట్‌; 3 ఫోర్లు) ధాటిగా ఆడింది.

లంక బౌలర్లలో ఇనొక రణవీర 3, ఒషాది రణసింఘే 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 104 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లంతా సమష్టిగా కట్టడి చేయడంతో చేతిలో వికెట్లున్నా ఛేదనలో శ్రీలంక వెనుకబడిపోయింది. రాధా యాదవ్‌కు 2 వికెట్లు దక్కాయి. ఇదే వేదికపై ఇరు జట్ల మధ్య రేపు రెండో టి20 మ్యాచ్‌ జరుగుతుంది.  
చదవండి: IRE Vs IND T20 Series: ఆ ఐదుగురు ఆటగాళ్లతో జర జాగ్రత్త.. లేదంటే టీమిండియాకు కష్టమే..!

Videos

కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్

హైదరాబాద్ లో కరోనా కేసు నమోదు

జహీరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్

ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ విచారం

YSRCP హరికృష్ణను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి.. దారుణం! : Ambati Rambabu

Sake Sailajanath: ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు

First case: కడప కరోనా కేసును దాచిపెట్టేందుకు అధికారుల యత్నం

హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ సర్కార్ 6 షరతులు

Chittoor: మామిడి రైతుల ఆవేదన..చేతులెత్తేసిన కూటమి

West Godavari: పేదల కల కలగానే మిగిలింది పడకేసిన ఇళ్ల నిర్మాణ పనులు

Photos

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)