Breaking News

పాకిస్తాన్ కెప్టెన్‌గా మహ్మద్ రిజ్వాన్‌..!?

Published on Sun, 10/27/2024 - 11:59

స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకున్న పాకిస్తాన్ తమ తదుపరి సవాల్‌కు సిద్దమైంది. ఈ ఏడాది నవంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు పాక్ జట్టు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో పాకిస్తాన్ మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. అయితే ఈ  ఆసీస్ పర్యటనకు ముందు పాకిస్తాన్ వైట్ బాల్ జట్టుకు కొత్త కెప్టెన్ రానున్నాడు.

స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్‌ను తమ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా నియమించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సిద్దమైనట్లు తెలుస్తోంది.  జియో న్యూస్ ప్రకారం.. ఒకట్రెండు రోజుల్లో ఈ విషయంపై పీసీబీ నుంచి ఆధికారిక ప్రకటన వెలవడనుంది. ఇప్పటికే పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీతో రిజ్వాన్ సమావేశమైనట్లు సదరు మీడియా సంస్థ తమ కథనాల్లో పేర్కొంది.

ఈ మీటింగ్‌లోనే పాక్ వన్డే, టీ20ల్లో పాక్ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టేందుకు రిజ్వాన్ అంగీకరించినట్లు సమాచారం. ప్ర‌ధాన కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ సూచ‌న మేర‌కు రిజ్వాన్‌ను కెప్టెన్‌గా నియ‌మించాల‌ని పీసీబీ నిర్ణ‌యించుకున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఆల్‌రౌండర్ సల్మాన్ అలీ పాక్ వైస్ కెప్టెన్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్న‌ట్లు పీసీబీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

కాగా కెప్టెన్సీ ప‌రంగా రిజ్వాన్‌కు అనుభ‌వం ఉంది. జాతీయ జ‌ట్టుకు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌న‌ప్ప‌ట‌కీ, పాకిస్తాన్ సూప‌ర్ లీగ్‌, దేశీవాళీ టోర్నీల్లో నాయ‌కత్వ పాత్ర పోషించాడు.  పీఎస్ఎల్‌-2021లో అత‌డి సార‌థ్యంలోనే ముల్తాన్ సుల్తాన్ ముల్తాన్ ఛాంపియ‌న్‌గా నిలిచింది. కాగా టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024లో ఘోర వైఫల్యం త‌ర్వాత పాక్ కెప్టెన్సీ స్టార్ ప్లేయ‌ర్ బాబర్ ఆజం త‌ప్పుకున్న సంగ‌తి తెలిసిందే. నవంబర్‌ 4న జరగనున్న తొలి వన్డేతో పాక్‌ జట్టు ఆస్ట్రేలియా పర్యటన ప్రారంభం కానుంది.
చదవండి: IND vs NZ: రెండో టెస్టులో ఘోర ఓట‌మి.. గౌతం గంభీర్ కీల‌క నిర్ణ‌యం!?

 

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు