Breaking News

IPL 2025: రియాన్ పరాగ్ అరుదైన ఫీట్‌.. తొలి రాజస్తాన్ ప్లేయర్‌గా

Published on Wed, 04/16/2025 - 21:48

టీమిండియా ఆల్‌రౌండ‌ర్‌, రాజ‌స్తాన్ రాయల్స్ స్టార్ ప్లేయ‌ర్ రియాన్ ప‌రాగ్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఐపీఎల్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ త‌ర‌పున అత్య‌ధిక క్యాచ్‌లు అందుకున్న ప్లేయ‌ర్‌గా ప‌రాగ్ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌-2025లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో అభిషేక్ పోరెల్ క్యాచ్‌ను అందుకున్న పరాగ్.. ఈ అరుదైన ఫీట్‌ను తన పేరిట లిఖించుకున్నాడు.

రియాన్ పరాగ్ ఇప్పటివరకు ఐపీఎల్‌లో రాజస్తాన్‌ తరపున 41 క్యాచ్‌లు అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా వెటరన్ అజింక్య రహానే పేరిట ఉండేది. రహానే రాయల్స్ తరపున 40 క్యాచ్‌లు అందుకున్నాడు. తాజా మ్యాచ్‌తో రహానే రికార్డును పరాగ్ బ్రేక్ చేశాడు. కాగా రియాన్ అతి తక్కువ సమయంలోనే రాజస్థాన్ రాయల్స్ జట్టులో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 

బ్యాట్‌తోనే కాకుండా బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో కూడా తనవంతు పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 188 ప‌రుగులు చేసింది. ఢిల్లీ బ్యాట‌ర్ల‌లో అభిషేక్ పోరెల్(49) టాప్ స్కోర‌ర్‌గా నిలవ‌గా.. రాహుల్(38), స్ట‌బ్స్‌(34), అక్ష‌ర్ ప‌టేల్‌(34) రాణించారు. రాజ‌స్తాన్ బౌల‌ర్ల‌లో ఆర్చ‌ర్ రెండు వికెట్లు ప‌డగొట్ట‌గా.. తీక్ష‌ణ‌, హ‌స‌రంగ త‌లా వికెట్ సాధించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)