Breaking News

IPL 2025: రియాన్ ప‌రాగ్ చెత్త రికార్డు.. తొలి ప్లేయ‌ర్‌గా

Published on Thu, 03/27/2025 - 17:47

ఐపీఎల్‌-2025లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ వ‌రుస‌గా రెండో మ్యాచ్‌లో ఓట‌మి చ‌విచూసింది. గౌహతి వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో రాజ‌స్తాన్ ప‌రాజ‌యం పాలైంది. అంత‌కుముందు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మొద‌టి మ్యాచ్‌లోనూ రాజ‌స్తాన్‌ది ఇదే క‌థ‌.

ఈ మ్యాచ్‌లో44 ప‌రుగుల తేడాతో రాయ‌ల్స్‌ను ఎస్ఆర్‌హెచ్ చిత్తు చేసింది. అయితే ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ రెగ్యూల‌ర్ కెప్టెన్ సంజూ శాంస‌న్ లేని లోటు స్ఫ‌ష్టంగా క‌న్పించింది. శాంస‌న్ చేతి వేలి గాయం కార‌ణంగా మొద‌టి మూడు మ్యాచ్‌ల‌కు దూర‌మ‌య్యాడు. 

అత‌డి స్ధానంలో యువ బ్యాట‌ర్ రియాన్ ప‌రాగ్ రాజ‌స్తాన్ జ‌ట్టుకు సార‌థ్యం వ‌హిస్తున్నాడు. సంజూ ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కేవ‌లం బ్యాటింగ్‌కు మాత్ర‌మే వ‌స్తున్నాడు. రియాన్ పరాగ్ మాత్రం కెప్టెన్సీ ప‌రంగా పూర్తిగా తేలిపోయాడు. మైదానంలో వ్యూహ‌త్మ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌లేక‌పోతున్నాడు. ఈ క్ర‌మంలో ప‌రాగ్ ఓ చెత్త రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు.

ఐపీఎల్‌లో వ‌రుస‌గా రెండు మ్యాచ్‌ల్లో ఓట‌మి చ‌విచూసిన తొలి రాజ‌స్తాన్ కెప్టెన్‌గా ప‌రాగ్ నిలిచాడు. ఇప్ప‌టివ‌ర‌కు ఏ రాజ‌స్తాన్ కెప్టెన్ కూడా వ‌రుస‌గా రెండు మ్యాచ్‌ల్లో ఓట‌మి చ‌విచూడ‌లేదు. రాజ‌స్తాన్ ఫ్రాంచైజీకి ప‌రాగ్ ఏడువ కెప్టెన్ కావ‌డం గ‌మ‌నార్హం.

ప‌రాగ్ కంటే ముందు షేన్ వార్న్, షేన్ వాట్సన్, రాహుల్ ద్రవిడ్, స్టీవ్ స్మిత్, అజింక్య రహానే, సంజు శాంస‌న్ రాయ‌ల్స్‌కు కెప్టెన్‌ల‌గా వ్య‌వ‌హ‌రించారు. మ‌రో మ్యాచ్ త‌ర్వాత సంజూ తిరిగి రాజ‌స్తాన్ ప‌గ్గాలు చేప‌ట్టే అవ‌కాశ‌ముంది.
చ‌ద‌వండి: 300 సాధ్యమే.. లక్నో బ్యాటింగ్‌ ఆర్డర్‌ కూడా ప్రమాదకరమైందే: SRH కోచ్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)