Breaking News

రో.. నీలాంటి వ్య‌క్తి నా సొంత‌మైనంద‌కు చాలా గ‌ర్విస్తున్నా: రితికా

Published on Mon, 07/01/2024 - 16:33

అంత‌ర్జాతీయ టీ20ల్లో టీమిండియా కెప్టెన్‌, స్టార్ ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ శకం ముగిసిన సంగ‌తి తెలిసిందే. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024 విజ‌యనంత‌రం పొట్టి క్రికెట్‌కు రోహిత్ శ‌ర్మ విడ్కోలు ప‌లికాడు. ఎన్నో ఏళ్ల‌గా భార‌త్‌ను ఊరిస్తున్న వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను అందించి రోహిత్ త‌న టీ20 కెరీర్‌ను ముగించాడు.

140 కోట్ల భారతీయ‌ల క‌ల‌ను సార‌థిగా రోహిత్ సాకారం చేశాడు. ఈ క్ర‌మంలో రోహిత్‌ను ఉద్దేశించి త‌న భార్య రితికా సజ్దేహ్ భావోద్వేగ నోట్‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ప్రపంచకప్‌ గెలవాలన్న క‌ల నెర‌వేర‌డం త‌న‌కు ఎంతో ఆనందంగా ఉంద‌ని రితికా తెలిపింది.

"రో.. ఈ విజ‌యం నీకు ఎంత విలువైందో నాకు తెలుసు. ఈ క్ష‌ణం కోసం నీవు ఎంతగానో ఎదురుచూశావు. ఈ ఫార్మాట్, ఈ కప్, ఈ ఆట‌గాళ్లు, ఈ ప్ర‌యాణం.. మొత్తం ఈ  ప‌క్రియ అంతా నీవు క‌న్న‌ క‌ల‌. నీవు గత కొన్ని నెల‌ల‌గా ఎటువంటి  క్లిష్ట‌ప‌రిస్థితులు ఎదుర్కొన్నావో నాకు తెలుసు.

అది నీ మ‌న‌సు,  శరీరంపై ఎంత ప్రభావం చూపిందో నాకు తెలుసు. ఎట్టకేల‌కు నీ క‌ల నేరివేరింనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నీ  ఈ ప్ర‌యాణం ఎంతో స్పూర్తిదాయ‌కం. ఓ భార్యగా ఇందుకు నేను చాలా  గర్వపడుతున్నాను. 

కానీ నీ ఆట‌ను ఇష్ట‌ప‌డే వ్య‌క్తిగా నువ్వు ఇప్ప‌డు టీ20ల‌కు విడ్కోలు ప‌ల‌కడం చాలా బాధ‌గా ఉంది. ఇది నీకు క‌ఠిన నిర్ణ‌య‌మైనా.. జ‌ట్టుకు ఏది ఉత్త‌మైన‌దో దాని గురించే నువ్వు ఎక్కువ‌గా ఆలోచిస్తావు. కానీ నేను మాత్రం నీ నిర్ణ‌యాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నాను. 

ఏదేమైన‌ప్ప‌ట‌కి నీలాంటి గొప్ప వ్య‌క్తి నా సొంత‌మైనంద‌కు ఒక భార్య‌గా నేను చాలా గర్విస్తున్నా. ఐ లవ్‌ వ్యూ సో మచ్‌’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రితికా రాసుకొచ్చింది. కాగా టీ20 వరల్డ్‌కప్‌-2024 అనంతరం రోహిత్‌తో పాటు స్టార్‌ క్రికెటర్లు విరాట్‌ కోహ్లి, రవీంద్ర జడేజా సైతం పొట్టి క్రికెట్‌కు ముగింపు పలికాడు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)