Breaking News

పంత్‌కు అరుదైన గౌరవం.. ఢిల్లీ క్యాపిటల్స్‌ కీలక నిర్ణయం!

Published on Fri, 03/24/2023 - 16:26

ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌, టీమిండియా స్టార్‌ ఆటగాడు రిషబ్‌ పంత్‌ ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరం కానున్న సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్ 30న కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్.. నెమ్మదిగా కోలుకుంటున్నాడు. ఈ ఏడాది సీజన్‌లో ఢిల్లీ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ వ్యవహరించనున్నాడు.

ఇక ఇది ఇలా ఉండగా.. ఐపీఎల్‌కు దూరమైన రిషబ్‌ పంత్‌కు ఢిల్లీ క్యాపిటల్స్‌ టీమ్ మేనేజ్‌మెంట్ అరుదైన గౌరవం ఇవ్వనుంది. ఈ ఏడాది సీజన్‌లో పంత్‌ జెర్సీ నెంబర్‌తో బరిలోకి దిగాలని ఢిల్లీ జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్‌ హెడ్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ కూడా దృవీకరించాడు.

"మేం పంత్‌ను చాలా మిస్‌ అవ్వబోతున్నాం. ప్రతీ మ్యాచ్‌కు డగౌట్‌లో అతడు నా పక్కన కూర్చోవాలని నేను భావిస్తున్నాను. ఒకవేళ అది కుదరకపోతే మాకు సాధ్యమయ్యే మార్గాల్లో అతన్ని జట్టులో భాగం చేయాలనుకుంటున్నాము. మేము అతడి జెర్సీ  నంబర్‌ను మా షర్టులపై లేదా క్యాప్‌లపై ఉంచాలి అనుకుంటున్నాం.

అతడు మా జట్టుతో లేకపోయినా, ఎప్పటికీ అతడే మా నాయకుడు అని తెలియజేయడం కోసమే ఇదంతా. మేము ఇంకా పంత్‌ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలన్నది నిర్ణయించలేదు. అయితే  సర్ఫరాజ్ ఖాన్‌ మాత్రం మా జట్టుతో చేరాడు. ఈ ఏడాది సీజన్‌కు ముందు మేము ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడాలి అనుకుంటున్నాము" అని పాంటింగ్‌ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2023: ఐపీఎల్‌కు ముందు కేకేఆర్‌కు ఊహించని షాక్‌! ఇక అంతే సంగతి?

Videos

West Godavari: పేదల కల కలగానే మిగిలింది పడకేసిన ఇళ్ల నిర్మాణ పనులు

COVID Guidelines: ఏపీలో వైద్య ఆరోగ్యశాఖ అలర్ట్

సీఎం రేవంత్ బండారం మొత్తం బయటపడింది: కేటీఆర్

నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ పేరు

కేటీఆర్, హరీష్రరావు ఇంటికి వెళ్లి ఈ లేఖ తయారుచేశారు

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ రాజీనామా ?

తమన్నా అవసరమా.. కర్ణాటకలో కొత్త వివాదం

Vijayawada: వల్లభనేని వంశీ విజువల్స్

వైఎస్ఆర్ సీపీ కార్యకర్త హరికృష్ణకు CI భాస్కర్ చిత్రహింసలు

కసిగట్టిన కరోనా మళ్లీ వచ్చేసింది!

Photos

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)