Breaking News

IPL 2025: ఇదేమి ఆట బ్రో.. పంత్ నీవు ఇక మార‌వా? ఫ్యాన్స్ ఫైర్‌

Published on Sun, 04/27/2025 - 21:22

ఐపీఎల్‌-2025లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కెప్టెన్ రిష‌బ్ పంత్ పేల‌వ ఫామ్ కొన‌సాగుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా   ఆదివారం వాంఖ‌డే వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో పంత్ దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. కీల‌క స‌మ‌యంలో క్రీజులోకి వ‌చ్చిన పంత్‌.. చెత్త షాట్ ఆడి త‌న వికెట్‌ను కోల్పోయాడు. రెండు బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులు మాత్ర‌మే చేసి ఔట‌య్యాడు.

ముంబై స్పిన్న‌ర్ విల్ జాక్స్ బౌలింగ్‌లో రివ‌ర్స్ స్వీప్ ఆడి త‌న వికెట్‌ను చేజార్చుకున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు ప‌ది మ్యాచ్‌లు ఆడిన పంత్‌.. 12.22 స‌గ‌టుతో కేవ‌లం 110 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే ఖ‌రీదైన ఆట‌గాడిగా నిలిచిన పంత్ ఆట తీరును ల‌క్నో అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. సోష‌ల్ మీడియాలో పంత్‌ను నెటిజ‌న్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. 

ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఇంత చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌ను చూడలేదంటూ నెటిజ‌న్లు పోస్ట్‌లు చేస్తున్నారు. పంత్ నీవు ఇక మార‌వా? అంటూ మ‌రికొంత‌మంది కామెంట్లు చేస్తున్నారు. కాగా ఐపీఎల్‌-2025 మెగా వేలంలో రూ. 27 కోట్ల భారీ ధ‌ర‌కు ల‌క్నో కొనుగోలు చేసింది. కానీ ధ‌ర‌క త‌గ్గ న్యాయం పంత్ చేయ‌లేక‌పోతున్నాడు. 

ఇక మ్యాచ్ విష‌యానికి వస్తే..ముంబై ఇండియ‌న్స్ చేతిలో 54 ప‌రుగుల తేడాతో ల‌క్నో ఓట‌మి పాలైంది. 216 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 161 ప‌రుగుల‌కు ఆలౌటైంది. లక్నో బ్యాట‌ర్ల‌లో ఆయూష్ బ‌దోని(35) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. మిచెల్ మార్ష్(34) ప‌ర్వాలేద‌న్పించాడు. ముంబై బౌల‌ర్ల‌లో జ‌స్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా..ట్రెంట్ బౌల్ట్ మూడు, విల్ జాక్స్ రెండు, బాష్ ఓ వికెట్ సాధించారు.

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)